వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎస్ సుమిత్రాలో హీరో అక్షయ్ కుమార్: మీకు సరిపోతుందా అంటూ మోడీకి నటి రమ్యా ప్రశ్న !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్దనౌకలను ట్యాక్సీని ఉపయోగించుకున్నట్లు ఉపయోగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చెయ్యడంతో బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్యా అలియాస్ దివ్యా స్పందన మోడీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారత యుద్దనౌకలో సంచరించడం సరిపోతుందా అంటూ నటి రమ్యా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

అక్షయ్ కుమార్ ఫ్యామిలీ

బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ కెనడ జాతీయుడు అని నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన గుర్తు చేశారు. బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుటుంబ సభ్యులు భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సుమిత్రాలో సంచరించి సెల్ఫీలు తీసుకున్నారని, మీరు ఎలా అనుమతి ఇస్తారు అంటూ ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ నటి రమ్యా ఆ ఫోటోలును ట్వీట్ చేశారు.

నరేంద్ర మోడీకి ప్రశ్నలు

ప్రధాని నరేంద్ర అతిపెద్ద అపద్దాలకోరు అంటూ నటి రమ్యా విమర్శించారు. భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సుమిత్రాలో నటుడు అక్షయ్ కుమార్ కుటుంబ సభ్యులు సంచరించిన విషయంలో మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు.

యుద్దనౌక కాదు

బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫ్యామిలీ సంచరించింది భారత యుద్దనౌక కాదు. అది రాష్ట్రపతి సంచరించే నౌక అంటున్నారు నెటిజన్లు. రాష్ట్రపతి అనుమతి లేకుండా బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫ్యామిలీ ఆ నౌకలో ఏలా సంచరిస్తుంది అనే ప్రశ్నలు మొదలైనాయి.

అక్షయ్ కుమార్ గ్రేట్

అక్షయ్ కుమార్ గ్రేట్

భారత యుద్దనౌకలో అక్షయ్ కుమార్ సంచరించడంలో తప్పు ఏముంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సైనికుల పట్ల నటుడు అక్షయ్ కుమార్ కు ఎంతో గౌరం ఉంది. ఉచితంగా మహిళా స్వయం రక్షణా శాలలను అక్షయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఒడిశా వరద భాదితుల కోసం నటుడు అక్షయ్ కుమార్ రూ. 1 కోటి విరాళం ఇచ్చారని నెటిజన్లు గుర్తు చేశారు. మీరు మండ్యకు వచ్చి ఎందుకు ఓటు వెయ్యలేదని నటి రమ్యాను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కెనడా జాతీయుడు

బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ కెనడా జాతీయుడు అంటూ నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన గుర్తు చేశారు. భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సుమిత్రాలో అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వీంకిల్ ఖన్నా, వారి కుమారుడు సంచరించి సెల్ఫీలు తీసుకున్నారు. ఇలా చెయ్యడాని మీరు అనుమతి ఇవ్వడం మీకు పద్దతిగా ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ నటి రమ్యా ట్వీట్ చేశారు.

English summary
Congress party social media chief Divya Spandana on Thursday slammed Prime Minister Narendra Modi for allegedly taking Canadian citizen Akshay Kumar with him onboard Indian Navy warship Sumitra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X