Actress: మంచి డైరెక్టర్ అంటూ ప్రచారం, నటి వ్యక్తిగత ఫోటోలు షేర్, బెడ్ రూమ్ కోరికలు, రీల్ రివర్స్!
ముంబాయి/ కోల్ కత్తా: సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఓ అందమైన యువతి కలలు కంటోంది. సొంత బాష సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటించింది. సొంత రాష్ట్రంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆ నటి బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఆశపడింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో డైరెక్టర్ తో పరిచయం అయ్యింది. తాను తీస్తున్న వెబ్ సిరీస్ లో నీకు హీరోయిన్ గా చాన్స్ ఇస్తానని అతను ఆ నటికి హామీ ఇచ్చాడు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో, ఫోన్లలో టచ్ లో ఉన్నారు. కొంతకాలం తరువాత నీ వ్యక్తిగత చిత్రాలు తనకు పంపించాలని, వాటిని చూసిన తరువాత నిన్ను హీరోయిన్ గా తీసుకుంటామని చెప్పాడు. ఆమె వ్యక్తిగత ఫోటోలను ఆ డైరెక్టర్ కు పంపించింది.
కొన్ని రోజులకు ఫోన్ చేసి నువ్వు నా కోరిక తీర్చిన తరువాతే హీరోయిన్ గా తీసుకుంటానని ఆమెకు చెప్పాడు. బెడ్ రూమ్ కోరికలు తీర్చడానికి ఆ నటి నిరాకరించింది. అంతే నీ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి నీకు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని, నీ సినిమా జీవితానికి చెక్ పెడుతానని ఆ డైరెక్టర్ ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆ నటి షాక్ అయ్యింది.
Missing
lady:
ప్రియుడితో
లేచిపోయిన
భార్య,
పట్టుకుని
లాడ్జ్
లో
పోలీసు?,
మధ్యలో
భర్త,
రివర్స్!

బెంగాలి నటికి ఆశ
కోల్ కత్తాకు చెందిన ఓ యువతి సినిమా నటి కావాలని ఆశపడింది. సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆ అందమైన యువతి కలలు కంటోంది. ఇప్పటికే ఆ యువతి బెంగాలి సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని బెంగాలి సినిమాల్లో నటించిన ఆ నటి బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఆశపడింది.

నేను మంచి డైరెక్టర్ అని ప్రచారం
నటి బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలోనేను మంచి డైరెక్టర్ అని చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్న ఓంప్రకాష్ తివారీతో ఆ బెంగాలి నటికి పరిచయం అయ్యింది. తాను తీస్తున్న వెబ్ సిరీస్ లో నీకు హీరోయిన్ గా చాన్స్ ఇస్తానని ఓంప్రకాష్ తివారీ ఆ నటికి హామీ ఇచ్చాడు.

వ్యక్తిగత చిత్రాలు చూడాలి.... నీ అందం గురించి తెలుసుకోవాలి
తరువాత ఓంప్రకాష్ తివారీ, ఆ నటి సోషల్ మీడియాలో, ఫోన్లలో టచ్ లో ఉన్నారు. కొంతకాలం తరువాత ఓంప్రకాష్ తివారీ నీ వ్యక్తిగత చిత్రాలు తనకు పంపించాలని, వాటిని చూసిన తరువాత నిన్ను హీరోయిన్ గా తీసుకుంటామని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమె వ్యక్తిగత ఫోటోలను డైరెక్టర్ ఓంప్రకాష్ తివారీకి పంపించింది.

ప్రతిఫలంగా నాకు పడక సుఖం కావాలి
కొన్ని రోజులకు ఆ నటికి ఫోన్ చేసిన ఓంప్రకాష్ తివారీ నువ్వు నా కోరిక తీర్చిన తరువాతే హీరోయిన్ గా తీసుకుంటానని, ప్రతిఫలంగా నువ్వు నా కోరికలు తీర్చాలని ఆమెకు చెప్పాడు. ఓంప్రకాష్ తివారీ బెడ్ రూమ్ కోరికలు తీర్చడానికి ఆ నటి నిరాకరించింది. అంతే నీ వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి నీకు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని, నీ సినిమా జీవితానికి చెక్ పెడుతానని డైరెక్టర్ ఓంప్రకాష్ తివారీ ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆ నటి షాక్ అయ్యింది.

వీడు డైరెక్టర్ కాదు.... ప్రొడక్షన్ హౌస్ లో?
తన వ్యక్తిగత ఫోటోలతో ఓంప్రకాష్ తివారీ చెయ్యకూడని పని చేస్తే నా జీవితం నాశనం అవుతుందనే భయంతో ఆ నటి ముంబాయిలోని మలాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని ఆ పోలీస్ స్టేషన్ అధికారి ధనంజయ్ లిగాడే మీడియాకు చెప్పారు. కేసు నమోదు చేసి ఓంప్రకాష్ తివారీని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అతను సినిమా డైరెక్టర్ కాదని, ప్రొడక్షన్ హౌస్ లో పని చేశాడని సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ లిగాడే అన్నారు.

వీడి స్కెచ్ మామూలుగా లేదు
ముంబాయిలోని ఓ ప్రొడక్షన్ హౌస్ లో ఓంప్రకాష్ తివారీ పని చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రొడక్షన్ హౌస్ లో పని చేసిన ఓంప్రకాష్ తివారీకి నటీనటునుల ఎలా ఎంపిక చెయ్యాలి అనే అనుభవం ఉందని, ఆ అనుభవం అడ్డం పెట్టుకుని తాను సినిమా డైరెక్టర్ అంటూ ఓం ప్రకాష్ తివారీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు.

అమాయకులు వీడి టార్గెట్
సినిమాల్లో నటించాలని ఆశపడుతున్న అమాయకులైన యువతులు, మహిళలను మోసం చేస్తున్నాడని, అతని మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ధనజంయ్ లిగాడే మీడియాకు చెప్పారు. మొత్తం మీద బెంగాలి నటికి బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేసి ఆమె జీవితంతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన ఓంప్రకాష్ తివారీ ఇప్పుడు కటకటాలపాలైనాడు.