• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Drug Mafia: జైల్లో హీరోయిన్లు రాగిణి, సంజనాల క్యాట్ ఫైట్, రాత్రి రామాయణం, తెల్లారితే, ఛీ ఈ జీవితం !

|

బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నువ్వానేనా అంటూ పొట్లాడుకుంటున్నారని వెలుగు చూసింది. డ్రగ్స్ కేసులో అరెస్టు కాకముందే రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటుందని స్యాండిల్ వుడ్ కు చెందిన అనేక మంది చెవులు కొరుకున్నారు. అయితే కాలం కలిసిరాకపోవడంతో జైల్లో ఉంటున్న రాగిణి, సంజనాలు ఒక్కటి అవుతారు ? అని స్యాండిల్ వుడ్ వర్గాలు భావించాయి. అయితే జైల్లో కూడా రాగిణి, సంజనాల మధ్య అర్దరాత్రి, తెల్లారిజామున పాము, ముంగీస, క్యాట్ ఫైట్ మొదలైయ్యిందని ఆరోపణలు గుప్పమున్నాయి.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 బెంగళూరు డ్రగ్స్ మాఫియా

బెంగళూరు డ్రగ్స్ మాఫియా

బెంగళూరు డ్రగ్స్ రాకెట్, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, శివప్రకాష్, రవిశంకర్, రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రశాంత్ రాంకా, వైభవ్ జైన్, ఆదిత్వ అళ్వా, ఉమా పెప్పర్ సైమన్, అశ్విన్ అలియాస్ బూగి, అభిస్వామి, రాహుల్ తూన్సేలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 జైల్లో చెక్కభజన

జైల్లో చెక్కభజన

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలకు తరలించారు. సుమారు నెల రోజుల నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని మహిళా ఖైదీలు ఉంటున్న బ్యారెక్ ల్లో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు విచారణ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు.

 బెయిల్ రాలేదు... టెన్షన్ తప్పదు

బెయిల్ రాలేదు... టెన్షన్ తప్పదు

బెంగళూరు డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకి బెయిల్ మంజూరు కాకపోవడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నటి సంజనా, అంతకు ముందే అరెస్టు అయిన రాగిణి ద్వివేది పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. అప్పటి నుంచి అనేకసార్లు రాగిణి, సంజనా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 28వ తేదీన మరోసారి బెంగళూరులోని ఎన్ టీపీఎస్ ప్రత్యేక కోర్టు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

 జైల్లోనే విచారణ

జైల్లోనే విచారణ

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రాగిణి, సంజనాలకు అనేక కష్టాలు ఎదరైనాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటి సంజనా, రాగిణిని ఈడీ అధికారులు అదే జైల్లోనే ఐదు రోజుల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. సినిమాల్లో నటిస్తూ వీరు ఎంత డబ్బు, ఆస్తులు సంపాధించారు ? డ్రగ్స్ దందాతో లింక్ లు పెట్టుకుని అక్రమంగా ఏమైనా ఆస్తులు సంపాధించారా ? అనే కోణంలో ఇటీవల ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను విచారణ చేసి వివరాలు సేకరించారు.

 ముందునుంచి అదే సీన్

ముందునుంచి అదే సీన్

స్యాండిల్ వుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయినల్లు రాగిణి ద్వివేది, సంజనాల గల్రానీలకు వృత్తిపరంగా, వ్యక్తిగతంలో గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. డ్రగ్స్ కేసులో రాగిణి, సంజనాలను అదుపులోకి తీసుకున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని వారం రోజుల పాటు జయనగర సమీపంలోని సిద్దాపురలో ఉన్న స్టేట్ హోమ్ లో విచారణ చేశారు. ఆ సమయంలో రాగిణి, సంజనాలు ఒకరిని ఒకరు మాట్లాడుకోకుండా యెడముఖం, పెడముఖం పెట్టుకుని ఉన్నారని వెలుగు చూసింది. ఇప్పుడు జైల్లో కూడా సేమ్ సీన్ రిపిట్ అవుతోంది.

 రాత్రి రాగిణి రామాయణం

రాత్రి రాగిణి రామాయణం

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఒకే సెల్ లో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనాలు ఉంటున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు నిద్రపోకుండా రాగిణి పుస్తకాలు, దినపత్రికలు చూస్తుందని తెలిసింది. అర్దరాత్రి వరకు లైట్లు వేస్తే తాను ఎలా నిద్రపోవాలని నటి సంజనా సాటి నటి రాగిణి మీద మండిపడుతోందని తెలిసింది. అయితే తనకు నిద్రరావడం లేదని, అందుకే పుస్తకాలు చదువుతున్నానని, పుస్తకాలు చదవాలంటే లైట్లు వెలగాలి కదా ? అంటూ రాగిణి ప్రశ్నిస్తోందని వెలుగు చూసింది.

 తెల్లారకముందే క్యాట్ ఫైట్

తెల్లారకముందే క్యాట్ ఫైట్

అర్దరాత్రి వరకు లైట్లు వేసుకుని పుస్తకాలు చదువుతున్న రాగిణి తెల్లవారుజామున మళ్లీ లైట్లు వేసి యోగా చేస్తోందని, నేను ఎలా నిద్రపోవాలని, మీరు ఏదైనా చెయ్యాలని సంజనా జైలు సిబ్బందికి ఫిర్యాదు చేసిందని తెలిసింది. నాకు రాత్రి నిద్రరావడం లేదు, ఉదయం యోగా చెయ్యడం అలవాటు, ఎవరి కోసం తాను తన పద్దతులు మార్చుకోనని రాగిణి తెగేసి చెప్పిందని తెలిసింది.

    Sandalwood డ్ర* Racket : Actor-Couple Diganth, Aindrita Ray Join CCB Probe || Oneindiia Telugu
     బెయిల్ వస్తే బయటకు తోసేయాలి

    బెయిల్ వస్తే బయటకు తోసేయాలి

    రాగిణి, సంజనాల పోరు ఎక్కువ అయ్యిందని, బెయిల్ వచ్చిన వెంటనే వీళ్లను బయటకు తోసేయాలని జైలు సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద స్యాండిల్ వుడ్ లో పాము, ముంగీసాలా పోట్లాడుకున్న రాగిణి, సంజనాలు ఇప్పుడు జైల్లో కూడా క్యాట్ ఫైట్ మొదలు పెట్టారని వెలుగు చూడటంతో వారి అభిమానులు అయ్యోపాపం అంటున్నారు.

    English summary
    Drug Mafia: Actress Ragini Dwivedi and Sanjjanaa Galrani's catfight in Bengaluru Parappana Agrahara jail.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X