డబ్బు కోసం కాదు, ఏదో కుట్ర ఉంది, నా వద్ద జవాబు లేదు: నటి
గత నెలలో మలయాళ నటిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు నటి తాజాగా మాట్లాడారు. డబ్బుల కోసం తనను వేధించలేదని, దాని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె అన్నారు.
తిరువనంతపురం: గత నెలలో మలయాళ నటిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు నటి తాజాగా మాట్లాడారు. డబ్బుల కోసం తనను వేధించలేదని, దాని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె అన్నారు.
ఈ కేసులో మాట్రిన్, పల్సర్ సుని అనే ఇద్దరితోపాటు మరో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడానికే నిందితులు అంతకు తెగించారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ విషయం గురించి ఓ మలయాళ పత్రికతో ఆమె మాట్లాడారు.
స్టార్స్‌ను సినిమా లొకేషన్స్‌కు తీసుకెళ్లే డ్రైవరు అంత ధైర్యంగా ఈ పని ఎలా చేస్తాడని, ఎలా, ఎందుకు, ఎవరు.. అంటే తన వద్ద సమాధానం లేదని, సినీ పరిశ్రమలో ఉన్న తన శత్రువులు ఈ పని చేశారని నేను చెప్పడం లేదని, కానీ కేవలం డబ్బు కోసం చేశారని చెప్పడం.. జరిగిన దానికి పొంతన లేకుండా ఉందన్నారు.

తనకు కొన్ని సందేహాలున్నాయని, తనకు సంతృప్తికరమైన సమాధానం కావాలని, చిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు ఉండరని కొందరు అన్నారని, కానీ తన విషయానికి వస్తే చిత్ర పరిశ్రమలో శాశ్వతమైన స్నేహితులు, శత్రువులు ఉన్నారని అన్నారు.
ఇలా తనకు జరిగింది, మళ్లీ ఇంకెవరికైనా జరగవచ్చునని, ఇవాళ తాను బయటపడి మాట్లాడితేనే రేపు ఇంకోకరు మాట్లాడగలరని, కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలను దాచుకోవద్దని, నేరస్తులు తప్పించుకునే అవకాశం ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
తనకు జరిగిన అన్యాయాన్ని దాచి ఉంటే కేవలం పది మందికి తెలిసేదని, ఇంత ధైర్యంగా తలెత్తి మాట్లాడే అవకాశం ఉండేది కాదని చెప్పారు. ఏదో తప్పు చేశానన్న భావనతో రాత్రుల్లో నిద్రలేకుండా ఉండాల్సి వచ్చేదని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తనకు పక్కా ప్రణాళిక ఉందన్నారు.












Click it and Unblock the Notifications