• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌లో చేరిన అలనాటి శృంగార తార షకీలా... ఇకపై మానవహక్కుల విభాగంలో సేవలు...

|

ఒకప్పుడు తన శృంగార సినిమాలతో దక్షిణాదిని షేక్ చేసిన నటి షకీలా(43) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇకనుంచి తమిళనాడు కాంగ్రెస్ మానవ హక్కుల విభాగంలో షకీలా సేవలు అందించనున్నారు.ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.

తెలుగు,తమిళం,మలయాళంలో షకీలా నటించిన శృంగార సినిమాలు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 1980,1990లలో మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సైతం ఆమె పోటీనిచ్చారు. షకీలా సినిమా రిలీజ్ అవుతుంటే స్టార్ హీరోలు తమ సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేందంటే... అప్పట్లో ఆమె సినిమాల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 18 ఏళ్ల వయసులో 1995లో ప్లే గర్ల్స్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా... మొత్తంగా 250 సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లుగా ఆమె వెండి తెరకు దూరమయ్యారు. గతేడాది రిచా చద్దా ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో షకీలా బయోపిక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

 Actress Shakeela joins Congress party in tamilnadu

ప్రస్తుతం తమిళ టీవీ ఛానెల్ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' రియాలిటీ షోలో షకీలా పాల్గొంటున్నారు. ఈ షోతో జనాల్లో ఆమెకు ఉన్న శృంగార తార ఇమేజ్‌ స్థానంలో లవింగ్ మదర్ ఇమేజ్ ఏర్పడింది. గత వారమే ఆమె ఆ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే త్వరలోనే ఆమె మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా,తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 2న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాంగ్రెస్,డీఎంకె కలిసి యూపీఏ కూటమిగా బరిలో దిగుతుండగా... అన్నాడీఎంకె,బీజేపీ పలు ఇతర పార్టీలు కలిసి ఎన్డీయే కూటమిగా బరిలో దిగుతున్నాయి. అటు కమల్ హాసన్ నేత్రుత్వంలోని మక్కల్ నీది మయ్యమ్,టీటీవీ దినకరన్ నేత్రుత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం-ఎంఐఎం ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పలు సర్వేలు తమిళనాట ఈసారి డీఎంకెదే గెలుపు అని వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
Actress Shakeela has joined the Congress. After accepting party membership, Shakeela said she would work as part of the Tamil Nadu Congress. Shakeela will be working in the human rights department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X