• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: ఇంటి ముందు నీ ఎక్స్పోజింగ్ ఏంది ?, వీధిలో నటి, స్థానిక మహిళలు ఢిష్యూం ఢిష్యూం !

|

చెన్నై: సినిమా నటి నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ యువకులు ప్రదక్షణలు చేస్తున్నారు. పనిలో పనిగా ఆమెను లొంగదీసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేశారని సమాచారం. కొందరు యువకులు సినిమా నటి ఇంటి కాంపౌండ్ గోడ ఎక్కి లోపలికి దిగడంతో వాళ్లను పట్టుకుని ఆమె చితకబాదడంతో రాద్దాంతం మొదలైయ్యింది. సినిమా నటి వీధిలోకి వచ్చి రెచ్చిపోవడంతో స్థానిక మహిళలు జోక్యం చేసుకున్నారు. సినిమా నటి, స్థానిక మహిళలు ఢిష్యూం ఢిష్యూం అంటూ తగులుకోవడంతో గొడవ పెద్దది అయ్యింది. నువ్వు మగాళ్లను రెచ్చగొట్టడానికి ఎక్స్పోజింగ్ చేస్తూ ఇలాంటి దస్తులు వేసుకుంటావని, నీ బండారం అందరికి తెలుసని మహిళలు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పంచాయితీ ముదిరి పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది.

Girl: తల్లితో గొడవ, అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని, ఆరు మంది గ్యాంగ్ రేప్, అత్తసోమ్ము అల్లుడు దానం !Girl: తల్లితో గొడవ, అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని, ఆరు మంది గ్యాంగ్ రేప్, అత్తసోమ్ము అల్లుడు దానం !

 చెన్నైలో తమిళ సినిమా నటి లక్ష్మి

చెన్నైలో తమిళ సినిమా నటి లక్ష్మి

తమిళనాడు రాజధాని చెన్నై సిటీలోని వలసరవక్కం ప్రాంతంలోని శ్రీదేవి కుప్పం ఏరియాలో తమిళ సినిమా నటి పాండిలక్ష్మి అలియాస్ లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటున్నది. తమిళంలో తెరకెక్కిన అనేక సినిమాల్లో పాండిలక్ష్మి సహాయనటిగా నటించింది. సినిమా షూటింగులు లేని సమయంలో ఆమె నివాసం ఉంటున్న ఇంటి మేడ మీద, టెర్రాస్ మీద, ఇంటి బయట నిలబడుతున్న పాండిలక్ష్మి ఫోజులు కొడుతోందని ఆరోపణలు ఉన్నాయి.

 క్యూలో కుర్రాళ్లు

క్యూలో కుర్రాళ్లు

సినిమా నటి పాండిలక్ష్మి నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ యువకులు ప్రదక్షణలు చేస్తున్నారు. పనిలో పనిలోగా పాండిలక్ష్మిని లొంగదీసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేశారని సమాచారం. కొందరు యువకులు సినిమా నటి పాండిలక్ష్మి ఇంటి బయట బైక్ లు, కార్లు నిలిపి ఆమెకు సైట్ కొట్టడంతో ఇంతకు ముందు ఆమె కొన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్లను పట్టించింది.

 నటి ఇంటి కాంపౌండ్ ఎక్కిన యువకులు

నటి ఇంటి కాంపౌండ్ ఎక్కిన యువకులు

స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు నటి పాండిలక్ష్మి ఇంటి కాంపౌండ్ గోడ ఎక్కి లోపలికి దిగారు. లాక్ డౌన్ దెబ్బతో షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్న పాండిలక్ష్మి ఆమె ఇంటి కాంపౌడ్ గోడ ఎక్కిన యువకులను నిలదీసింది. పావురాలు లోపలికి వచ్చాయని, వాటిని పట్టుకోవడం కోంస కాంపౌడ్ ఎక్కామని యువకులు చెప్పడంతో అక్కడ రాద్దాంతం మొదలైయ్యింది. ఇంటి గొడ దూకి లోపలికి వెళ్లిన యువకుల మీద నటి పాండిలక్ష్మి చెయ్యి చేసుకుని వాళ్లను చితకబాదింది.

 మహిళల ఎంట్రీతో సీన్ సిడేల్

మహిళల ఎంట్రీతో సీన్ సిడేల్

సినిమా నటి పాండిలక్ష్మి, స్థానిక యువకులు రోడ్డు మీదకు వచ్చి గొడవ పడటంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు ఎంట్రీ ఇచ్చారు. అందరూ గుమికూడటంతో నటి పాండిలక్ష్మి కోపంతో ఊగిపోయి స్థానిక మహిళల మీద నటి పాండిలక్ష్మి చెయ్యి చేసుకునింది. పాండిలక్ష్మి, స్థానిక మహిళల మద్య మాటామాటా పెరిగిపోవడంతో గొడవ పెద్దది అయ్యింది.

 ఇంటి దగ్గర నీ ఎక్స్పోజింగ్ ఏంది ..మగాళ్లను రెచ్చగొడుతున్నావా ?

ఇంటి దగ్గర నీ ఎక్స్పోజింగ్ ఏంది ..మగాళ్లను రెచ్చగొడుతున్నావా ?

నువ్వు సినిమాల్లో వేసుకునే పొట్టిపొట్టి దస్తులు ఇంటి దగ్గర వేసుకుని ఎక్స్పోజింగ్ చేస్తూ మగాళ్లను రెచ్చగొడుతున్నావని, వారిని నీ చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావని స్థానిక మహిళలు మండిపడ్డారని తెలిసింది. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, అడగడానికి మీరెవరు అంటూ పాండిలక్ష్మి కూడా రెచ్చిపోవడంతో రచ్చరచ్చ అయ్యింది.

 మేము తట్టుకోలేకపోతున్నాము..... మీరే ఏదైనా చెయ్యండి

మేము తట్టుకోలేకపోతున్నాము..... మీరే ఏదైనా చెయ్యండి

సినిమా నటి పాండిలక్ష్మి కారణంగా ఈ ఏరియానే భ్రష్టుపట్టిపోతుందని, ఆమె మీద చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు అందరూ నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేశారు. సుమారు 30 మంది మహిళలు లాక్ డౌన్ సమయంలో సినిమా నటి పాండిలక్ష్మి తీరుతో ధర్నా చెయ్యడంతో వలసరవక్కం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నటి పాండిలక్ష్మి బిల్డప్పులు తట్టుకోలేకపోతున్నామని, మీరే ఏదైనా చెయ్యాలని స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఓమైగాడ్..... ఏంది మేడమ్ ఈ రామాయణం

ఓమైగాడ్..... ఏంది మేడమ్ ఈ రామాయణం

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మహిళలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. నటి పాండిలక్ష్మి ఇంటి ముందు ఎవ్వరూ బైక్ లో వెళ్లకూడదని, అటు వైపు చూస్తే ఆమెనే చూస్తున్నారని బిల్డప్ ఇచ్చి కావాలని పోలీసు కేసు పెడుతానని బెదిరిస్తోందని స్థానిక యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 మేడమ్ గురించి తమిళనాడు మొత్తం తెలుసు

మేడమ్ గురించి తమిళనాడు మొత్తం తెలుసు

మేడమ్ ఏమిటి ఈ రామాయణం అంటూ పోలీసులు సైతం నటి పాండిలక్ష్మిని ప్రశ్నించారు. నటి పాండిలక్ష్మి, స్థానిక మహిళలకు పోలీసులు నచ్చచెప్పారు. ఈమె (నటి పాండిలక్ష్మి) గురించి తమిళనాడు మొత్తం తెలుసని, మేము కొత్తగా ఏమీ చెప్పనవసరం లేదని స్థానిక మహిళలు మండిపడ్డారు. స్థానిక మహిళలు ధర్నా విరమించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తం మీద నటి పాండిలక్ష్మి వ్యవహారంతో వలసరవక్కం ప్రాంతంలో రచ్చరచ్చ అయ్యింది.

English summary
Actress: Supporting actress beaten by area people in Chennai Valasarawakkam. Actress Pandilakshmi fights with public in the area. Area people protest against the actress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X