• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: మలేషియా బ్యూటీ పగ, ఏసీలో ఉండమనింది, జైల్లో చీకట్లో చీటీగలు చంపుతున్న లీడర్ !

|

చెన్నై: హీరోయిన్ ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఐదు సంవత్సరాల పాటు కాపురం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఐటీ శాఖా మాజీ మంత్రి మణికందన్ జైలుపాలైనాడు. హ్యాపీగా ఏసీలో ఇంతకాలం ఏ హీరోయిన్ తో ఎంజాయ్ చేశాడో అదే హీరోయిన్ దెబ్బకు ఈ రోజు మణికందన్ సెంట్రల్ జైల్లో చీకట్లో కుర్చుకుని చీటీగలు చంపుకుంటున్నాడు. మలేషియా ఆడపులి దెబ్బకు మణికందన్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఇద్దరు ఇష్టపడి ఐదు సంవత్సరాలు కలిసి కాపురం చేశారని అంటున్నారు, ఇదే సమయంలో లైంగిక వేధింపుల సెక్షన్ ఎలా పెట్టారు ? అంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. మణికందన్ మీద ఆరు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో నటి మీద లైంటిక వేధింపుల సెక్షన్ కింద నమోదు చేసిన కేసు మార్చే పనిలో పడ్డారు. హీరోయిన్ చాందిని పగతో అనుకున్న పనిసాధించడంతో ఇప్పుడు హీరోయిన్ జీవితంలోని రియల్ స్టోరి మరోమలుపు తిరిగింది.

Brother wife: వదిన ఒంటరిగా ఉందని మరిది రొమాన్స్, దెబ్బకు ఔట్, గిల్లి గిచ్చాడని ఫినిష్ !Brother wife: వదిన ఒంటరిగా ఉందని మరిది రొమాన్స్, దెబ్బకు ఔట్, గిల్లి గిచ్చాడని ఫినిష్ !

చాందిని మలేషియా రాయభార కార్యాలయం అధికారి

చాందిని మలేషియా రాయభార కార్యాలయం అధికారి

చాందిని మలేషియా రాయభార కార్యాలయం అధికారిగా కూడా పని చేస్తోంది. ఇదే సమయంలో మలేషియా ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్లలు చాలా మంది చాందినికి పరిచయం అయ్యారు. ఇదే లిస్టులో అప్పటి తమిళనాడు ఐటీ శాఖా మంత్రిగా పని చేసే మణికందన్ కూడా ఉన్నాడు. మణికందన్ అలాగే చాందినికి పరిచయం అయ్యారు.

హీరోయిన్ గా సెలబ్రిటి అయిపోయింది

హీరోయిన్ గా సెలబ్రిటి అయిపోయింది


మలేషియాకు చెందిన నటి చాందిని అనేక తమిళ సినిమాల్లో నటించింది. తమిళ సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న చాందినికి మంత్రి పదవిలో ఉన్న మణికందన్ మరింత దగ్గర అయ్యాడు. తరువాత అన్నాడీఎంకే పార్టీలో చురుకైన నాయకుడిగా, మంత్రి హోదాలో ఉన్న మణికందన్ తనతో చనువుగా ఉండేవాడని నటి చాందిని అంటోంది.

తమిళ సినిమా స్టోరీ చెప్పిన మణికందన్ ?

తమిళ సినిమా స్టోరీ చెప్పిన మణికందన్ ?

నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో చెన్నైలోని శాస్త్రీనగర్ లో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు కాపురం చేశామని నటి చాందిని ఆరోపిస్తోంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని, భార్య హోదాలో నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనకు తమిళ సినిమా స్టోరీ చెప్పాడని, తనతో స్వర్గం చూసి తన సర్వస్వం దోచుకున్న తరువాత తననే మోసం చేశాడని హీరోయిన్ చాందిని ఆరోపించింది.

అబార్షన్ సాక్షాలు పక్కాగా ఉన్నాయి

అబార్షన్ సాక్షాలు పక్కాగా ఉన్నాయి


తనకు మాయమాటలు చెప్పిన మాజీ మంత్రి మణికందన్ తనకు ఇప్పటి వరకు మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. మాజీ మంత్రి మణికందన్ కు స్నేహితుడైన డాక్టర్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో తనకు అబార్షన్ చేశాడని, అబార్షన్ చేసిన డాక్టర్ తాను మాట్లాడుకున్న సమయంలో ఆ సంభాషణలు తాను మొబైల్ లో రికార్డు చేశానని, తాను ఆసుపత్రికి వెళ్లినట్లు తన దగ్గర పక్కాసాక్షాలు ఉన్నాయని నటి చాందిని అంటోంది.

బ్లాక్ మెయిల్ తో చాందిని రివర్స్

బ్లాక్ మెయిల్ తో చాందిని రివర్స్


తన మీద నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం మనం కాపురం చేసే సమయంలో రహస్యంగా బెడ్ రూమ్ లో తీసిన నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో, మహిళా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఏరోజు చాందినిని మణికందన్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడో ఆరోజ నుంచి ఆమె విసిగిపోయి అతని మీద నమ్మకం లేక పోలీసు కేసు పెట్టాలని డిసైడ్ అయ్యిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

అనుకున్న పని చేసిన చాందిని

అనుకున్న పని చేసిన చాందిని


నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న నిన్ను కచ్చితంగా జైల్లో పెట్టిస్తానని చాందిని ఆరోజే మణికందన్ ను హెచ్చరించిందని తెలిసింది. చాందిని కేసు పెట్టిన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి మణికందన్ చెన్నై, మదురై, క్రిష్ణగిరి, హోసూరు తదితర ప్రాంతాల్లో తలదాచుకుని చివరికి బెంగళూరు చేరుకున్నారని తెలిసింది. టైమ్ బాగా లేకపోవడంతో ఆదివారం ఉదయం బెంగళూరులో మాజీ మంత్రి మణికందన్ తమిళనాడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

ఇష్టపడి ఉన్నారు కదా ? ఆ సెక్షన్ ఎందుకు

ఇష్టపడి ఉన్నారు కదా ? ఆ సెక్షన్ ఎందుకు

చెన్నై పోలీసులు చెన్నైలోని సైదాపేటలోని న్యాయస్థానం న్యాయమూర్తి ముందు మణికందన్ ను హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. చాందిని, మణికందన్ ఇద్దరూ ఇష్టప్రకారం కొంతకాలం కలిసి ఉన్నారని మీరే (పోలీసులు) అంటున్నారు, అలాంటప్పుడు లైంగిక దాడి సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేశారు ?, ఆ సెక్షన్ ను మార్చి కేసు విచారణ చెయ్యండి అని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు.

 జులై 2వ తేదీ వరకు చిప్పకూడు

జులై 2వ తేదీ వరకు చిప్పకూడు


తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ మీద ఆరు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. అందులో లైంగిక దాడి కేసు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు లైంగిక దాడి సెక్షన్ తొలగించే పనిలో చెన్నై సిటీ పోలీసులు నిమగ్నం అయ్యారని తెలిసింది. తమిళనాడు ఐటీ శాఖ మాజీ మంత్రి మణికందన్ ను జులై 2వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

  Actress Sanjana Galrani Distributing Daily Food to Poor people during lockdown | Oneindia Telugu
  పగపట్టిన హీరోయిన్

  పగపట్టిన హీరోయిన్

  మలేషియా రాయభార కార్యాలయం అధికారి అయిన హీరోయిన్ చాందిన తనను మోసం చేసిన మాజీ మంత్రి మణికందన్ మీద పగపట్టింది. ఎలాగైనా తనను మోసం చేసిన మణికందన్ ను చట్టపరంగా శిక్షపడేలా చెయ్యాలని పోలీసులను ఆశ్రయించి అతన్ని అరెస్టు చేయించింది.
  ఎవరితో అయితే ఇంతకాలం మస్త్ మజా చేశాడో అదే మలేషియా ఆడబిడ్డ దెబ్బకు మణికందన్ కు తగినశాస్తి జరిగిందని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు.

  English summary
  Actress: Tamil Nadu former minister Manikandan has been remanded in judicial custody till July 2 in Chennai.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X