బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: ప్రముఖ నటి కేసులో పోలీసు కస్టడీకి హరి నాడార్, ఆ దర్శకుడికి సపోర్టు చేసి ?, గోల్డ్ బాబుకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం కేసులో ఓ రాజకీయ పార్టీ నాయకుడు,డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పలు బాషల సినిమాల్లో నటించిన నటి తనను ప్రముఖ దర్శకుడు, రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్ కావడంతో బిత్తరపోయిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందిన నటి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన కొన్ని రోజులకు ప్రముఖ పార్టీ నాయకుడి మీద సంచలన ఆరోపణలు చేసింది. ఇదే కేసులో మరో రాజకీయ పార్టీ నాయకుడు, వ్యాపారుల దగ్గర కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని మోసం చేశాడని అరెస్టు అయిన బంగారు బాబును పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Lady owner: లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, ఇంటి యజమానితో సీఐ సెటైర్లు, క్లైమాక్స్ లో!Lady owner: లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, ఇంటి యజమానితో సీఐ సెటైర్లు, క్లైమాక్స్ లో!

 ప్రముఖ నటి విజయలక్ష్మి

ప్రముఖ నటి విజయలక్ష్మి

కర్ణాటక (బెంగళూరు)కు చెందిన నటి విజయలక్ష్మి చెన్నై చేరుకుని తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ఫ్రెండ్స్ అనే తమిళ సినిమాతో రంగప్రవేశం చేసిన నటి విజయలక్ష్మి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెన్నైలోని తిరువాన్మియూర్ ఈస్టో కోస్ట్ రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ లో నటి విజయలక్ష్మి నివాసం ఉంటున్నది.

ఆరోజు సాయంత్రం ?..... నటి వీడియో వైరల్

ఆరోజు సాయంత్రం ?..... నటి వీడియో వైరల్

2020 జులై 25వ తేదీన చెన్నైలోని తిరువాన్మియర్ ఏరియాలోని సొంత అపార్ట్ మెంట్ లో అధిక రక్తపోటుకు సంబంధించిన మాత్రలు అదిక మోతుదులో తీసుకున్న నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చెయ్యకముందు ఆమె ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చెయ్యడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ప్రముఖ దర్శకుడు, పొలిటికల్ లీడర్ కారణం

ప్రముఖ దర్శకుడు, పొలిటికల్ లీడర్ కారణం

తనను నామ్ తమిళ్ కచ్చి పార్టీ కోఆర్డినేటర్ సీమాన్ మోసం చేశాడని, తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, నా అత్మహత్యకు సీమాన్ కారణం అని నటి విజయలక్ష్మి ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. నిమిషాల్లోనే నటి విజయలక్ష్మి వీడియో వైరల్ కావడంతో బిత్తరపోయిన చెన్నై పోలీసులు తిరువాన్మియల్ లోని ఆమె ఇంటికి చేరుకుని ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

అప్పట్లోనే కేసు పెట్టిన నటి విజయలక్ష్మి

అప్పట్లోనే కేసు పెట్టిన నటి విజయలక్ష్మి

చెన్నైలోని అడయార్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందింది. ఆసుపత్రిలోనే పోలీసులు మూడు గంటలకు పైగా నటి విజయలక్ష్మిని విచారణ చేసి వివరాలు సేకరించారు. నటి విజయలక్ష్మి కొన్ని రోజుల తరువాత ఆమె ఆసుపత్రిలో కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన నటి విజయలక్ష్మి కొన్ని రోజుల తరువాత పోలీసులకు దర్శకుడు, రాజకీయ నాయకుడు సీమాన్ మీద కేసు పెట్టింది. అప్పట్లోనే సీమాన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

హరి నాడార్ ఎంట్రీతో కలకలం

హరి నాడార్ ఎంట్రీతో కలకలం

తమిళనాడులో మరో రాజకీయ పార్టీని స్థాపించిన బంగారు రాజు హరి నాడార్ అలియాస్ గోపాలక్రిష్ణ నాడార్ గోల్డ్ కింగ్ (39) చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మెడలో కేజీల కేజీల బంగారు గొలుసులు, చేతులకు బంగారు కడియాలు వేసుకున్న తిరునల్వేలికి చెందిన హరి నాడార్ తమిళనాడులో 2021 లొ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలగులం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ హరి నాడార్ నటి విజయలక్ష్మి కేసులో ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది.

చీటింగ్ కేసులో అరెస్టు

చీటింగ్ కేసులో అరెస్టు

2020లో తనతో సంబంధం పెట్టుకున్న దర్శకుడు, నామ్ తమిళ్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్ తనను మోసం చేశాడని, నా మీద మీడియా ముందు ఆరోపణలు చేస్తే నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని నటి విజయలక్ష్మి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించడానికి సీమాన్ అతని స్నేహితుడు హరి నాడార్ ను తన దగ్గరకు పంపించి చంపేస్తానని బెదిరిస్తున్నాడని నటి విజయలక్ష్మి హరి నాడార్ అలియాస్ గోపాలక్రిష్ణ నాడార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చీటింగ్ కేసులో సెంట్రల్ జైల్లో నాడార్

చీటింగ్ కేసులో సెంట్రల్ జైల్లో నాడార్

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తకు బ్యాంకులో రూ. 360 కోట్ల లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన హరి నాడార్ ఆ వ్యాపారి నుంచి రూ. 7 కోట్లు తీసుకుని మోసం చేశాడని బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత ఏడాది హరి నాడార్ ను తమిళనాడులో అరెస్టు చేసి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

బెంగళూరు టూ చెన్నైకి హరి నాడార్

బెంగళూరు టూ చెన్నైకి హరి నాడార్

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న హరి నాడార్ ను బుధవారం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని చెన్నైలోని సైదాపేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు హరి నాడార్ ను రిమాండ్ కు తరలించారని చెన్నై పోలీసులకు సైదాపేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నై పోలీసులు హరి నాడార్ ను విచారణ చెయ్యడానికి అతన్ని అదుపులోకి తీసుకే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటి విజయలక్ష్మి పలువురు కన్నడ నటీనటులుతో పాటు పలువురు నిర్మాతలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ దగ్గర నివాసం ఉండటానికి ఉచితంగా ఓ ఇల్లు ఇస్తామని కన్నడ నిర్మాత ఒకరు చెప్పడంతో నటి విజయలక్ష్మి అందుకు సున్నితంగా నిరాకరించింది.

English summary
Actress: Tamilnadu police is going to take Hari Nadar in their custody to inquire about Actress Vijayalakhsmi suicide attempt issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X