వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదర్శ్ సొసైటీ కుంభకోణం: చవాన్‌కు ఎదురుదెబ్బ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అది పెద్ద కుంభకోణాల్లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం. ఆ కుంభకోణం కేసు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసు చార్జిషీట్ నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం నాడు నిర్ద్వద్దంగా తోసిపుచ్చింది.

అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తహిలియానీ బుధవారం తీర్పు చెప్పారు. ఇందుకోసం నాలుగు వారాల గడువిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Adarsh case: HC rejects plea to drop Ashok Chavan

నాలుగు వారాల వరకు అశోక్ చవాన్‌పై ఎలాంటి అభియోగాల నమోదు కానీ, విచారణ కానీ జరపరాదని ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గత జనవరి నుంచి అశోక్ చవాన్ ఈ మినహాయింపును అనుభవిస్తున్నారు, మరో నాలుగు వారాల పాటు సదరు మినహాయింపును పొడిగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. మహారాష్ట్రలో 201లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఈ స్కాంలో అశోక్ చవాన్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతని స్ధానంలో పృద్వీరాజ్ చవాన్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే.

English summary
The Bombay high court on Wednesday rejected a CBI plea to delete the name of former Maharashtra chief minister Ashok Chavan from the list of accused in the Adarsh Society scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X