బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drugs racket: నటి రాగిణి బెడ్ రూమ్ లో గంజాయి సిగరెట్లు ? ల్యాబ్ లో, ముంబాయి లాయర్లు, గోవింద !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో పీకల్లోతు కూరుకుపోయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్, బహుబాష నటి రాగిణికి అసలు సిలసైన సినిమా కష్టాలు మొదలైనాయి. నటి రాగిణి అపార్ట్ మెంట్ లోని ఆమె బెడ్ రూమ్ లో గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ సిగరెట్లను ల్యాబ్ కు పంపించారు. రాగిణి పోలీసు కస్టడీ ముగిసిపోవడంతో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. రాగిణి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పడంతో మరో ఐదు రోజులు ఆమెను విచారణ చెయ్యడానికి కస్లడీలోకి తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో రాగిణి న్యాయవాదులు కోర్టులో లేకపోవడంతో ఆమె బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ముంబాయి నుంచి ప్రత్యేక న్యాయవాదులు బెంగళూరు వచ్చి రాగిణికి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

 రాగిణి ఇంట్లో గంజాయి సిగరెట్లు !

రాగిణి ఇంట్లో గంజాయి సిగరెట్లు !

బెంగళూరు నగరంలోని యలహంక సమీపంలోని అనన్యా అపార్ట్ మెంట్ లోని నటి రాగిణి ద్వివేది ఇంట్లో గత శుక్రవారం సోదాలు చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు అనేక వస్తువులు సీజ్ చేశారు. రాగిణి ఇంట్లో చాలా సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాగిణి ఇంట్లో చిక్కిన సిగరెట్లలో గంజాయి నింపారని. అవి గంజాయితో తయారు చేసిన సిగరెట్లు అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

 బెడ్ రూమ్ లో అవి ఎందుకు ఉన్నాయి ?

బెడ్ రూమ్ లో అవి ఎందుకు ఉన్నాయి ?

నటి రాగిణి ద్వివేది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అనేక వస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రాగిణి ఇంట్లో కొన్ని సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నటి రాగిణి ఇంట్లోని ఆమె బెడ్ రూమ్ లోనే ఆ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

 రాగిణి డ్రామాలతో ల్యాబ్ కు సిగరెట్లు

రాగిణి డ్రామాలతో ల్యాబ్ కు సిగరెట్లు

తాను దూమపానికి వ్యతిరేకమని, తాను ఎప్పుడు సిగరెట్లు తాగలేదని, సిగరెట్ల గురించి తనకు తెలీదని నటి రాగిణి పోలీసుల విచారణలో చెబుతోంది. అయితే సిగరెట్లు తాగడం అలవాటు లేని నటి రాగిణి వాటిని బెడ్ రూమ్ లో ఎందుకు పెట్టుకుంది? ఆ సిగరెట్లు ఎవరైనా తీసుకెళ్లి అక్కడ పెట్టారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో నటి రాగిణి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సిగరెట్లలో గంజాయితో పాటు డ్రగ్స్ ఏమైనా కలిపారా ? అని పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వాటిని ప్రయోగశాల (ల్యాబ్)కు పంపించామని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అంటున్నారు.

 రాగిణి ఏం సమాధానం చెప్పడం లేదు

రాగిణి ఏం సమాధానం చెప్పడం లేదు

శుక్రవారం రాగిణిని అరెస్టు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. బెంగళూరులోని సిద్దాపురలోని స్టేట్ హోమ్ లో నటి రాగిణిని విచారణ చేస్తున్నారు. సోమవారం కస్టడీ గడువు పూర్తి కావడంతో నటి రాగిణిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 1వ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

 ఐదు రోజులు కస్టడి

ఐదు రోజులు కస్టడి

నటి రాగిణి విచారణకు సహకరించడం లేదని, మరో 10 రోజులు కస్టడీకి అనుమతి ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి జగదీష్ కు మనవి చేశారు. అయితే ఐదు రోజులు నటి రాగిణిని విచారణ చెయ్యడానికి న్యాయమూర్తి జగదీష్ అనుమతి ఇచ్చారు. నటి రాగిణిని మరో ఐదు రోజులు విచారణ చేసి మరింత వివరాలతో పాటు ఆమె ఇంట్లో చిక్కిన గంజాయి సిగరెట్ల వ్యహారం గురించి పూర్తి సమాచారం బయటకు తియ్యాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

Recommended Video

Sushant Singh Rajput కేసు విచారణ పై లేడి అమితాబ్ Vijaya Shanthi పోస్ట్ || Oneindia Telugu
 ముంబాయి లాయర్లు

ముంబాయి లాయర్లు

శుక్రవారం నటి రాగిణి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే అదే రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నటి రాగిణిని అరెస్టు చేశారు. సోమవారం నటి రాగిణి న్యాయవాదులు కోర్టులో ఆమె బెయిల్ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చెయ్యలేదు. నటి రాగిణి న్యాయవాదులు కోర్టుకు హాజరుకాలేదని తెలిసింది. ముంబాయికి చెందిన కొందరు న్యాయవాదులు నటి రాగిణికి బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద నటి రాగిణి ద్వివేదికి అసలు సిసలైన సినిమా కష్టాలు ఎదురైనాయని కొందరు న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
Drugs racket: Bengaluru 1st Additional Chief Metropolitan Magistrate court ordered for 5 days of CCB police custody Ragini Dwivedi. Lawyer of Ragini Dwivedi on Monday filed a fresh plea for conditional bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X