వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్ధ శత్రువులు?: యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు , వీడియో వైరల్ !

లక్నో: అవును వారిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు, ప్రత్యర్థులు. కానీ, వారు మాట్లాడితే సంచలనమో, వివాదాస్పదమో అవుతుంది. రెండు వ్యతిరేక వర్గాలుగా ఉన్న ఆ నేతలిద్దరూ కలిశారు. చేతులు కలిపారు. సరదాగా మాట్లాడుకున్నారు.
ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ కథంతా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ గురించి. ఎప్పుడూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసుకునే వీరు గురువారం సరదాగా మాట్లాడుకోవడం, చేతులు కలుపడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

 సరదాగా పలకరించుకుని..

సరదాగా పలకరించుకుని..

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ నేత ఆజంఖాన్.. ఒకే సమయంోల అసెంబ్లీ కారిడార్‌లోకి అడుగుపెట్టారు. ఒకరినొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు.

 ఆకట్టుకుంది.. ఆశ్చర్య పర్చింది..

ఆకట్టుకుంది.. ఆశ్చర్య పర్చింది..

చేతులు కలిపి నడస్తూ.. వివిధ అంశాలలపై చర్చించారు యోగి-ఆజంఖాన్. ఈ పరిణామం అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత వారిని ఆకట్టుకుంది. ఆజంఖాన్ తోపాటు అతని కుమారుడు అబ్దుల్లా కూడా ఉన్నారు.

గతంలో విరుద్ధ ప్రకటనలు

అయితే, గతంలో యోగి, ఆజంఖాన్ ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండేవి.

ఒకసారి యోగి మాట్లాడుతూ.. నమాజ్, సూర్య నమస్కారాలూ దాదాపు ఒకేలా ఉంటాయని అన్నారు. దీనిపై ఆజంఖాన్ స్పందిస్తూ.. అలా అయితే సూర్య నమస్కారాలకు బదులు నమాజ్ చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు.

ఆజంఖాన్‌కు చురక

ఆజంఖాన్‌కు చురక

కొందరు భోగానికే ఆసక్తి చూపుతారని, యోగాకు కాదని.. అలాంటి వారి వల్లే రెండు వర్గాలు కలవకుండా ఉన్నాయని సీఎం యోగి.. ఆజంఖాన్‌కు చురకంటించారు. అంతకుముందు, గుజరాత్ ముస్లింల నుంచి మంచిని నేర్చుకోవాలని ఆజంఖాన్‌కు హితవు పలికారు. ఆజంఖాన్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Arch-rivals, Uttar Pradesh chief minister Adityanath and Samajwadi Party leader Azam Khan, were seen walking together, holding hands, inside the state assembly premises on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X