వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతలది మొసలి కన్నీరు.. సోన్‌బద్ర ఘటనపై యోగి

|
Google Oneindia TeluguNews

సోన్‌బద్ర : ఇటీవల యూపీలోని సోన్‌బద్రలో జరిగిన నరమేధం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన స్పందించారు. సోన్‌బద్ర ఘటనకు కారణమెవరు అని ప్రశ్నించారు. గిరిజన రైతులను కాల్చి చంపిన యజ్ఞ దత్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదా అని ప్రశ్నించారు.

అండగా ఉంటాం ..
గిరిజన రైతు కుటుంబాలను ఆదివారం యోగి పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాల్పులు జరిపిన దత్, ఇతరులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఇదివరకు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిని ఒక్కో మృతుని కుటుంబానికి రూ.18.50 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు.. అలాగే గాయపడ్డవారికి రూ.2.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు.

Adityanath blames Congress for Sonbhadra massacre that claimed 10 lives

ఉంబాలో మృతుల కుటుంబసభ్యులను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పరామర్శించేందుకు వెళ్లిన మరుసటి రోజే .. యోగి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనను అడ్డుకున్న బీజేపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై యోగి స్పందిస్తూ ..' కాంగ్రెస్ నేతలవి మొసలి కన్నీళ్లు అని మండిపడ్డారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రతో వ్యవహరించేదని గుర్తుచేశారు. ఆయా భూములు గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్, టీఎంసీ పార్టీలు బీజేపీని దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. అంతేకాదు యోగి పరిహారం పెంచడంపై ప్రియాంక స్పందించారు. తాను వచ్చి డిమాండ్ చేస్తే పరిహారం పెంచారని ... అలాగే త్వరలో వారికి పట్టాలు కూడా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday reiterated that the Congress was responsible for the murder of 10 tribal farmers who were shot dead over land dispute violent in Sonbhadra district this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X