వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు: సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు..!

వివాహేతర సంబంధం నేరం కాదని... దానిపై ఉన్న చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని చెబుతూ కొట్టివేసింది. వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగికంగా కలిస్తే అది నేరం కాదని న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరి ఏకాభిప్రాయంతోనే ఆ కార్యం జరుగుతుందని పేర్కొంది. ఒక పురుషుడు శృంగారం కోసం ప్రేరేపించడం మహిళ బాధితురాలుగా ఉండటం అనేది జరగదని... పురుషుడు స్త్రీ కలిసి శృంగారంలో పాల్గొంటారు కాబట్టి ఇద్దరిది సమాన బాధ్యత ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. వివాహం తర్వాత స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యభిచారంపై ఉన్న చట్టం భార్య భర్త సొత్తు అని చెప్పేలా ఉందని... అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

వ్యభిచారం కారణంగానే ఎక్కువగా విడాకులు అవుతున్నాయని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చట్టం పేరుతో మహిళ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లకూడదని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 497లోని అంశాలు ఏకపక్షంగా ఉంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. నైతిక విలువల కంటే ప్రేమతో కూడిన విలువలకే సర్వోన్నత న్యాయస్థానం ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు ఒక పెళ్లైన వ్యక్తి మరొకరి భార్యతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడితే ఇద్దరినీ జైలులో పెట్టరాదని కోర్టు సూచించింది. మొత్తానికి సెక్షన్ 497 వివక్షపూరితంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తో పాటు నలుగురు జడ్జీలు జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు విచారించి సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకపక్ష తీర్పును వెలువడించారు.

 కేసు నేపథ్యం ఇదీ..!

కేసు నేపథ్యం ఇదీ..!

వివాహ వ్యవస్థలో భార్య భర్తల మధ్య ఏదైనా వివాదం నెలకొంటే కేవలం మగవారిని మాత్రమే ఇప్పటి వరకు దోషిగా చేస్తున్నారని ఆ చట్టాన్ని పునఃపరిశీలించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి.సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఆగష్టులో విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే అంతకుముందు ఇచ్చిన తీర్పులో ఐపీసీ సెక్షన్ 497ను ప్రస్తావిస్తూ కేవలం ఒక వ్యక్తి ఒకే వివాహం చేసుకోవాలని చెప్పడం లేదని అయితే వివాహ వ్యవస్థపై విశ్వసనీయత కలిగి ఉండాలని తీర్పు చెప్పింది. అయితే సుప్రీంలో దాఖలైన పిటిషన్లన్నీ చట్టంలో ఉన్న ఈ ప్రొవిజన్లను కొట్టివేయాలని కోరాయి.

వివాహ వ్యవస్థపై విశ్వసనీయత ఉండాలి

వివాహ వ్యవస్థపై విశ్వసనీయత ఉండాలి

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఆగష్టులో విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే అంతకుముందు ఇచ్చిన తీర్పులో ఐపీసీ సెక్షన్ 497ను ప్రస్తావిస్తూ కేవలం ఒక వ్యక్తి ఒకే వివాహం చేసుకోవాలని చెప్పడం లేదని అయితే వివాహ వ్యవస్థపై విశ్వసనీయత కలిగి ఉండాలని తీర్పు చెప్పింది. అయితే సుప్రీంలో దాఖలైన పిటిషన్లన్నీ చట్టంలో ఉన్న ఈ ప్రొవిజన్లను కొట్టివేయాలని కోరాయి. వివాహం తర్వాత మగవారు వ్యభిచారం చేస్తే అందుకు మగవారిని మాత్రమే బాధ్యులుగా చేస్తున్నారని... మహిళలను మాత్రం వదిలేస్తున్నారని ఇలాంటి వ్యవస్థ వద్దని చెబుతూ రద్దు చేయాలని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో పిటిషన్ విన్న సుప్రీంకోర్టు మహిళలను శిక్షించేలా కొత్త సవరణ అయితే చట్టంలో చేర్చలేమని స్పష్టం చేసింది.

విడాకులు సమాజానికి ఎలా మేలు చేస్తాయి..?

విడాకులు సమాజానికి ఎలా మేలు చేస్తాయి..?

స్వాతంత్ర్యం కంటే ముందునుంచి ఉన్న వ్యభిచార చట్టంపై వాదనలు విన్న ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా... సమాజంలో వ్యభిచారం అనేది పౌరులు చేసే తప్పు అని అది నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యభిచారం, విడాకులకు మరో పద్ధతిని సూచించారు. అంతేకాదు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మగవారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించడంపై ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కేంద్రం తరపున ఐపీసీ సెక్షన్ 497 పై వాదించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ పింకి ఆనంద్... సమాజానికి ఈ చట్టం మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోందని కాబట్టి సెక్షన్ 497ను కొనసాగిస్తూనే వివాహ వ్యవస్థపై ఉన్న పవిత్రతను పరిరక్షిస్తామని కేంద్రం స్టాండ్‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే వివాహంలో గొడవలు వచ్చి భార్యాభర్తలు విడిపోతే అది సమాజానికి ఎలా మేలు చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.

సెక్షన్ 497 కింద మహిళ భర్త తన ప్రియుడిని విచారణ చేసే అధికారం ఉంది. అదే సమయంలో భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా..లేదా వ్యభిచారానికి పాల్పడినా మహిళకు ఆ స్త్రీని ప్రశ్నించే హక్కు సెక్షన్ 497 కల్పించలేదు.అంతేకాదు వ్యభిచారంలో తన భర్తను కూడా ప్రశ్నించే హక్కుకానీ అధికారం కానీ సెక్షన్ 497 ఇవ్వలేదు.

English summary
The Supreme Court on Thursday ruled the adultery law as unconstitutional. One on the 19th century adultery law in which, under penal code’s section 497, it is an offence if a married man has sex with the wife of another married man without his “connivance” or “consent”. But only men, and not women, can be prosecuted under the adultery law. Adultery is the only provision in the penal code that treats men and women differently, for one, because it treats a married woman as the ‘property’ of their husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X