వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్ గేట్స్ దంపతులకు పద్మభూషణ్: అద్వానీకి పద్మ విభూషణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీకి, ప్రముఖ సినీ నటులు అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌కుమార్‌, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ను పద్మ పురస్కారాలు వరించాయి. దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. నలుగురు తెలుగు తేజాలనూ పద్మ పురస్కారాలు వరించాయి. వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన మొత్తం 104 మందికి కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది.

వీరిలో తొమ్మిది మందిని పద్మవిభూషణ్‌, 20 మందిని పద్మ భూషణ్‌, 75 మందిని పద్మశ్రీ అవార్డులతో గౌరవించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారగ్రహీతలకు మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో రాష్ట్రపతి అవార్డులను అందజేస్తారు. అవార్డుల జాబితాలో 17 మంది ఎనన్నారైలు, విదేశీయులు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందూ మతగురువులు స్వామి రామభద్రాచార్య, స్వామి సత్యమిత్రానందగిరి, కర్ణాటకకు చెందిన శివకుమారస్వామి,పోర్చుగల్‌కు చెందిన జగద్గురు అమృత సూర్యానంద మహరాజ్‌లకు పద్మ పురస్కారాలు వరించాయి.

Advani, Amitabh Bachchan, Dilip Kumar get Padma Vibhushan

పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీతలు

దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన వారిలో ప్రముఖ రాజకీయనాయకులు ఎల్‌.కె.అద్వానీ (ప్రజాసంబంధాలు- గుజరాత్‌), ప్రకాశ్‌సింగ్‌ బాదల్ ‌(ప్రజాసంబంధాలు-పంజాబ్‌), సినీనటులు అమితాబ్‌ బచ్చన్‌(కళలు- మహారాష్ట్ర), దిలీప్‌కుమార్‌(కళలు- మహారాష్ట్ర), ప్రముఖ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌(ప్రజాసంబంధాలు- ఢిల్లీ), ధర్మస్థల జైన్‌ ఆలయానికి చెందిన డి.వీరేంద్ర హెగ్డే(సామాజికసేవ- కర్ణాటక), అణుశాస్త్రవేత్త ఎం.ఆర్‌.శ్రీనివాసన్‌ (శాస్త్ర, సాంకేతికరంగం - తమిళనాడు), హిం దూ మతగురువు జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య(ఇతర-యూపీ), కరీం ఆల్‌ హుస్సేనీ ఆగాఖాన్‌(వాణిజ్యం, పరిశ్రమలు-ప్రాన్స్‌/యూకే) ఉన్నారు.

పద్మభూషణ్‌ పురస్కార గ్రహీతల్లో ప్రముఖులు

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వాటమి(పౌరసేవ- తమిళనాడు), మాజీ లోక్‌సభ కార్యదర్శి సుభాష్‌.సి.కాశ్యప్ ‌(ప్రజాసంబంధాలు- ఢిల్లీ), పాత్రికేయులు రజత్‌ శర్మ(విద్య, సాహిత్యం- ఢిల్లీ), స్వపన్‌ దాస్‌గుప్తా (విద్య, సాహిత్యం-ఢిల్లీ), న్యాయవాది హరీష్‌సాల్వే(ప్రజాసంబంధాలు- ఢిల్లీ), హృద్రోగవైద్యుడు అశోక్‌సేథ్‌(వైద్యం-ఢిల్లీ), హిందూ మతగురువులైన స్వామి సత్యమిత్రానంద గిరి(ఇతర-యూపీ), శివకుమారస్వామి(ఇతర- కర్ణాటక)లను పద్మభూషణ్‌ వరించింది. కాగా, సంజయ్‌ లీలా బన్సాలీ (కళలు-మహారాష్ట్ర), బీజేపీ ప్రచారంలో కీలకపాత్ర పోషించిన పాటల రచయత ప్రసూన్‌ జోషి (కళలు-మహారాష్ట్ర), ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒక రైన టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌(వాణిజ్యం, పరిశ్రమలు- కర్ణాటక) తదితరులను పద్మశ్రీ వరించింది.

పద్మ పురస్కారాలు పొందిన విదేశీయులు

పద్మవిభూషణ్‌: కరీం ఆల్‌ హుస్సేనీ ఆగాఖాన్‌(వాణిజ్యం, పరిశ్రమలు, ప్రాన్స్‌/యూకే)
పద్మ భూషణ్‌ : మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ బిల్‌ గేట్స్‌, ఆయన సతీమణి బిల్‌గేట్స్‌ మెలిందా ఫౌండేషన్‌ సహవ్యవస్థాపకురాలు మెలిందా గేట్స్‌(సామాజికసేవ, అమెరికా), ఇండోఅమెరికన్‌ గణితశాస్త్రవేత్త మంజుల్‌ భార్గవ్‌(శాస్త్రసాంకేతికరంగం-అమెరికా) తదితరులు ఉన్నారు.

English summary
The Padma Bhushan awardees include Microsoft founder and philanthropist Bill Gates and his wife Melinda Gates, who have donated billions so far towards healthcare in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X