వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీకి అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీనియర్ నేత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఇంట్లోనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అద్వానీ కృషి ఎనలేనిది. పార్టీని 2 సీట్ల నుంచి అధికారం చేపట్టేవరకు విస్తరించింది అద్వానీయే.

గత ఐదురోజుల నుంచి అద్వానీ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కాకుండా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉందని వైద్యులు చెప్పినట్టు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

advani got viral fever

అద్వానీ బీజేపీలో అగ్రనేత. వాజ్ పేయి తర్వాత అంత ప్రజాధారణ ఉన్న నేత. ప్రధాని పదవీ వెంట్రుక వాసిలో మిస్సయిన నేత. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ గురువు కూడా. బీజేపీని 2 సీట్ల నుంచి పగ్గాలు చేపట్టేవరకు తీసుకెళ్లింది అద్వానీయే. కానీ వాజ్ పేయికి ప్రధాని పదవీ దక్కింది. అద్వానీ మాత్రం డిప్యూటీ ప్రధాని పోస్టుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

English summary
BJP's top leader Advani is sick. He is suffering from viral fever. This is a group of doctors at home. Doctors say his condition is stable. Advani's effort to bring the BJP to power has been immense. Advani has expanded the party from two seats to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X