వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరైన సమయంలోనే అద్వానీ నిష్ర్కమణ : కాంగ్రెస్ తీరు మార్చుకోవాలన్న శివసేన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేత అద్వానీని తప్పించి, సరైన సమయంలో బీజేపీ గౌరవించిందని శివసేన అభిప్రాయపడింది. ఎన్నికల్లో అద్వానీకి టికెట్ ఇవ్వక, ఆయనతోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించేలా బీజేపీ పెద్దలు వ్యవహరించారని తన పత్రిన సామ్నా ఎడిటోరియల్ లో రాసింది. ఒకవిధంగా ఇది మంచిదేనని పేర్కొన్నది.

75 ఏళ్ల దాటిన వారికి విశ్రాంతి

75 ఏళ్ల దాటిన వారికి విశ్రాంతి

ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త స్ట్రాటజీ అమలు చేసింది. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వబోమని ప్రకటించింది. కొత్తవారికి అవకాశం ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టంచేసింది. దీంతో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్ రాజ్ మిశ్రా, ఇతర నేతలు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు తమ విధుల నుంచి రిటైర్ కావాల్సిందేనని .. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం అద్వానీ లాంటి నేతలకు భావి నాయకుల మధ్య సముచిత గౌరవం లభిస్తుందని అభిప్రాయపడింది.

రామ్ లక్ష్మణ్ : వాజ్ పేయి, అద్వానీ

రామ్ లక్ష్మణ్ : వాజ్ పేయి, అద్వానీ

దేశంలో బీజేపీ బలోపేతం కోసం వాజ్ పేయి, అద్వానీ విశేషంగా క‌‌ృషి చేశారని సామ్నా రాసింది. 2 సీట్ల నుంచి అధికారం చేపట్టేందుకు వారు అహోరాత్రులు శ్రమించారని గుర్తుచేసింది. వారిద్దరూ రామ, లక్ష్మణులు పార్టీ ఉన్నతికి రేయింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నది. వాజ్ పేయి చనిపోయాక .. అద్వానీ మీడియా ముందుకు రాలేని పరిస్తితి ఏర్పడింది. వారిద్దరి స్థానాన్ని మోదీ, అమిత్ షా భర్తీ చేస్తున్నారని తెలిపింది. అలాగే అద్వానీ భీష్ముడిగా అభివర్ణించింది. అతని సలహాలు, సూచనలను శివసేన ఎల్లవేళలా పాటించిందని వెల్లడించింది.

ఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితిఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి

కాంగ్రెస్ పై విమర్శలు

కాంగ్రెస్ పై విమర్శలు

కాంగ్రెస్ పార్టీలో మాత్రం వ్యక్తి పూజ ఉంటుందని విమర్శించారు. అక్కడ గాంధీ నెహ్రూ వారసులకు తప్ప మిగతావారికి చోటు ఉండదని పేర్కొన్నది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావుకు ఎలాంటి గౌరవం దక్కిందో మనకు తెలుసు. అలాగే సీతారాం కేసరిని ఎలా పక్కన పెట్టారో భరతజాతికి తెలుసు అని ఎడిటోరియల్ లో రాసింది.

English summary
After the BJP dropped Lal Krishna Advani's name from the list of candidates for the 2019 Lok Sabha polls from Gujarat, Shiv Sena, in its mouthpiece Saamana, said the BJP stalwart should have retired himself rather that the the party forcing him to step down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X