వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ నియంత్రణ.. ఆసుపత్రులకే కేంద్రం కీలక సూచనలు ఇవే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సలహాలు,సూచనలు ఇస్తూనే.. అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వైరస్ ఒక్కసారిగా విజృంభించినా.. ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేందుకు సన్నద్దమైంది. ముఖ్యంగా దేశంలో ఆసుపత్రులపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.

అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు పాటించాలని చెప్పింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Advisory for Hospitals and Medical Education Institutions over coronavirus

ఆసుపత్రులకు కేంద్రం ఆదేశాలు
1 అవసరం లేని సర్జరీలను వాయిదా వేసుకోవాలి.

2.ప్రతీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని పడకలను వేరుచేసి, ఐసోలేషన్ సౌకర్యాలు కల్పించడానికి సిద్దంగా ఉంచాలి.
3. అన్ని ఆసుపత్రులు మాస్కులు, చేతి తొడుగులు, వ్యక్తిగత రక్షణ పరికరాలతో సహా అదనపు వనరులను సమీకరించుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి
4.ప్రీ మరియు పారా క్లినికల్ విభాగాలతో సహా వివిధ స్పెషాలిటీ డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బందిని సమీకరించి వైరస్ సంక్రమణ, నివారణ చర్యలపై శిక్షణ ఇవ్వాలి.
5.భవిష్యత్ అవసరాల కోసం ఆసుపత్రులు తగినంత సంఖ్యలో వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్ మాస్కులను సేకరించుకోవాలి.
6.అన్ని ఆస్పత్రులు వెంటిలేటర్ / ఐసీయూ సంరక్షణ కోసం తగిన శిక్షణ పొందిన సిబ్బందిని కలిగి ఉండాలి.
7.ఆరోగ్యపరంగా నిలకడగా ఉన్నవారిని ఆసుపత్రులు వీలైనంత త్వరగా డిశ్చార్జి చేయవచ్చు.
8.పేషెంట్‌తో పాటు కేవలం ఒకరిరని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించాలి.

IEC Activities :

9.పేషెంట్లు దగ్గేటప్పుడు చేతులు అడ్డుపెట్టుకోమని చెప్పాలి. అలాగే ఆసుపత్రిలో ఏమేమీ చేయాలో.. చేయవద్దో చెప్పాలి. మాస్కులు సరిగ్గా తొడుక్కున్నారో లేదో చూడాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పాలి.

10.ఆసుపత్రిలో ఎటువంటి హడావుడి చేయకుండా పేషెంట్లకు అవగాహన కల్పించాలి.

English summary
The medical infrastructure in the country needs to be prepared for any possible influx of patients on account of COVID 19. In this context, the following interventions are proposed up to 31st March 2020. They will be reviewed as per the evolving situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X