వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సల్మాన్ ఖాన్, కరణ్ జొహార్ కారణం: మూవీ మాఫియా: కోర్టులో పిటీషన్

|
Google Oneindia TeluguNews

పాట్నా: బాలీవుడ్‌లో ప్రకంపనలను సృష్టించిన స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారంపై న్యాయస్థానం గడప తొక్కింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ మూవీ మాఫియా ప్రమేయం ఉందని ఆరోపణలను బలం కలిగించేలా అడుగులు పడ్డాయి. బిహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారని ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ మూవీ మాఫియా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో మరో విషాదం: అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల్లోనే..సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో మరో విషాదం: అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల్లోనే..

ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జొహార్, సంజయ్ లీలా భన్సాలీ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ ఏక్తా కపూర్ సహా మరో నలుగురి పేర్లను ఆయన ఈ పిటీషన్‌లో చేర్చారు. ఈ ఎనిమిది మందీ సుశాంత్ సింగ్‌కు మానసిక ప్రశాంతత లేకుండా చేశారని, ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లేలా వ్యవహరించారని తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

Advocate Sudhir Kumar Ojha filed a case against Karan Johar, Salman Khan in Bihar Court

వారిపై చట్టపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం పిటీషన్ వేశారు. సుశాంత్ సింగ్ కేరీర్ అత్యున్నత దశలో కొనసాగుతోందని, అలాంటి సమయంలో ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదని సుధీర్ కుమార్ ఓఝా చెప్పారు. తమ కేరీర్‌కు పోటీగా ఎదుగుతున్నాడనే కారణంతో ఆయనను బాలీవుడ్ మూవీ మాఫియా అణచి వేయడానికి ప్రయత్నించింని ఆరోపించారు.

Recommended Video

Sushant Singh Rajput's Fan ఆత్మహత్య, సూసైడ్ నోట్ లో ఏం రాసాడో తెలుసా ?

సుమారు ఏడు సినిమాల నుంచి సుశాంత్ సింగ్‌ను తప్పించడానికి సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్, కరణ్ జొహార్ కారణం అయ్యారని విమర్శించారు. మరి కొన్ని సినిమాలు విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడాన్ని మూవీ మాఫియా జీర్ణించుకోలేకపోయిందని అన్నారు. వారిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు.

English summary
Advocate Sudhir Kumar Ojha filed a case against Karan Johar, Salman Khan, Sanjay Leela Bhansali, Ekta Kapoor and other fout peoples in connection with actor Sushant Singh Rajput's suicide case in a court in Muzaffarpur, Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X