వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో పిల్లల మరణాలపై అందరం సిగ్గుపడాలి...! ప్రధాన మంత్రి మోడీ

|
Google Oneindia TeluguNews

బీహార్‌లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపినిచ్చారు.కాగా ఈ మరణాలు సంభవించడం కూడ దురదృష్టకరమని మోడీ పేర్కోన్నారు. మరణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మొదటీ సారీ రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

 బీహార్ మరణాలపై నోరు విప్పిన ప్రధానమంత్రి

బీహార్ మరణాలపై నోరు విప్పిన ప్రధానమంత్రి

కాగా వ్యాధి నివారణపై రాష్ట్ర్ర ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇక వ్యాధి నివారణకు కోసం కట్టుబడి ఉన్నామని బీహార్ ప్రజలకు హమీ ఇచ్చారు. వ్యాధిని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ట్ర ప్రభుత్వాలు కలిసి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తెలిపారు. ఆరోగ్యపరమైన భారత దేశం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పటిష్ట పరాచాల్సిన అవసరముందని తెలిపారు.ఇందుకోసం బీదలకు అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు.

Recommended Video

పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
మరణాలపై మోడీని విమర్శించిన కాంగ్రెస్

మరణాలపై మోడీని విమర్శించిన కాంగ్రెస్

కాగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రధాన మంత్రి మోడీ ప్రజా సమస్యలను పట్టించుకోవడంతోపాటు,బీజేపీకి రాజకీయాలు తప్ప గ్రౌండ్ లెవల్‌లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నేత ఆదీర్ రంజన్ చౌదరీ విమర్శించారు.ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఎన్నికల మూడ్ నుండి బయటకు రాలేదని ఆయన అన్నారు. ఆయన పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం నిరాశ పరిచిందని విమర్శలు ఎక్కుపెట్టారు.ఈనేపథ్యంలో వ్యవసాయం నుండి ఇండస్ట్రీయల్ వరకు అభివృద్దిని సాధిస్తామన్న వ్యాఖ్యలను కూడ ఆయన గుర్తు చేశారు.

రాజ్యసభలో మరణాలపై స్పందించిన మోడీ

రాజ్యసభలో మరణాలపై స్పందించిన మోడీ

దీంతో ప్రధాని మోడీ నేరుగా బీహార్‌లో పిల్లలు చనిపోతున్న అంశంపై రాజ్యసభలో మాట్లాడారు.. నేడు కూడ మెదడు వాపు వ్యాధితో ఒక చిన్నారీ మృతి చెందాడు. కాగా బీహార్‌లో ఇప్పటికే ముజఫర్‌నగర్ జిల్లా అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం 435 మెదడు వాపు కేసులు గత నెల రోజుల వ్యవధిలోనే నమోదైనట్టు తెలిపారు. కాగా రాష్ట్ర్ర వ్యాప్తంగా 700మందికి పైగా ఈ వ్యాధి సోకినట్టు అధికారులు గణంకాలు విడుదల చేశారు. మరోవైపు గత నెల రోజుల కాలం నుండే సుమారు 160మందికి పైగా చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడ్డారు...

English summary
prime Minister Narendra Modi on Wednesday said deaths in Bihar due to encephalitis are sad and unfortunate.Addressing the Rajya Sabha on Wednesday, Prime Minister Narendra Modi said, "The deaths in Bihar due to acute encephalitis syndrome are unfortunate and a matter of shame for us. We have to take this seriously."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X