బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక ఎన్నికల్లో 2,500 మంది పోటీ: 883 మంది కోటీశ్వరులు, రూ. వేల కోట్ల ఆస్తి, బీజేపీలో 93 శాతం

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్దుల ఆస్తుల వివరాలు తెలుసా??

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు 2018లో 2,500 మంది పోటీ చేస్తున్నారు. అందులో 883 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలతో పాటు స్వాతంత్ర పార్టీ అభ్యర్థులతో కలిపి 883 మంది కోటీశ్వరులు 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించారు.

2,500 మంది అభ్యర్థులు

2,500 మంది అభ్యర్థులు

2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి సరాసరి ఆస్తి రూ. 7. 54 కోట్లు ఉంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,500 మంది అభ్యర్థుల సమర్పించిన అఫిడవిట్లు (నామినేషన్లకు జత చేశారు) పరిశీలించిన అసోషియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

టాప్ త్రీలో వెయ్యి కోట్ట ఆస్తి

టాప్ త్రీలో వెయ్యి కోట్ట ఆస్తి

అన్ని పార్టీల కోటీశ్వరుల జాబితా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాకృష్ణ (బెంగళూరు) రూ. 1,020 కోట్లు, ఎంటీబీ ఎన్. నాగరాజు (బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే) రూ. 1,015 కోట్లు, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ (బెంగళూరు గ్రామీణ జిల్లా కనకపుర) రూ. 840 కోట్లు ఆస్తి కలిగి ఉన్నారు.

సరాసరి ఆస్తి విలువ

సరాసరి ఆస్తి విలువ

అన్ని పార్టీలతో పోల్చుకుంటే బీజేపీలో 208 మంది (93 శాతం), కాంగ్రెస్ లో 207 మంది (94 శాతం), జేడీఎస్ లో 154 మంది (17 శాతం), ఆప్ లో 9 మంది (33 శాతం), స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 199 మంది (18శాతం) సరాసరి రూ. 1 కోటి ఆస్తి కలిగి ఉన్నారని ఎడీఆర్ వెల్లడించింది.

రూ. కోట్లలో ఎన్నికల ఖర్చు

రూ. కోట్లలో ఎన్నికల ఖర్చు

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ భారీ మొత్తంలో నగదు ఖర్చు చెయ్యడానికి సిద్దం అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీకి పోటీగా జేడీఎస్ పార్టీ నాయకులు శాసన సభ ఎన్నికల్లో భారీ మొత్తంలో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
Karnataka Assembly Elections 2018: Association of Democratic Reforms (ADR), Affidavits from Candidates reveal 93% Karnataka BJP candidates crorepatis. Total of 208 crorepatis from Congress, JD(S) has 154, Independent 155.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X