వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వీడొక్కడే’ తరహాలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌.. కడుపులో హెరాయిన్‌ క్యాప్సూల్స్‌ పగిలి..

హీరో సూర్య సినిమా ‘వీడొక్కడే’లో మాదిరిగా రూ.8 కోట్ల విలువైన 61 హెరాయిన్ క్యాప్సూల్స్ నోటి ద్వారా మింగి తన కడుపులో భద్రపరచుకుని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించాడో అఫ్ఘన్ యువకుడు. కానీ కథ అడ్డంతిరిగింది..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు, తమిళంలో సూపర్‌ హిట్టైన హీరో సూర్య సినిమా 'వీడొక్కడే' గుర్తుందా? డ్రగ్స్‌, డైమండ్స్‌ అక్రమ రవాణా దందాపై రూపొందించిన ఆ సినిమాలో.. కస్టమ్స్‌ అధికారులకు దొరకకుండా కొకెయిన్‌ ప్యాకెట్లు మనుషుల కడుపులో పెట్టి సరఫరా చేస్తుంటారు. ఆలా పొట్టలోనే డ్రగ్స్‌ ప్యాకెట్లు పగిలిపోవడంతో హీరో ఫ్రెండ్‌ చిట్టీ చనిపోతాడు కూడా.

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. అఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ యువకుడు విమానాశ్రయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

drugs

అతడిని స్కాన్‌ చేయగా, అతడి కడుపులో సుమారు రూ.8 కోట్ల విలువైన 61 హెరాయిన్‌ ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే ఆపరేషన్‌ చేసి వాటిని బయటికి తీసినప్పటికీ, ఆ యువకుడి ప్రాణాలు దక్కలేదు. చనిపోయిన యువకుడిని అఫ్ఘన్‌ జాతీయుడైన హమీద్‌ మొహమ్మద్‌(19)గా గుర్తించినట్లు నార్కోటిక్స్‌ అధికారులు తెలిపారు.

సఫ్‌దార్‌ గంజ్‌ ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్‌ అతడి కడుపులోంచి 61 క్యాప్సుల్స్‌ వెలికి తీశామని, ఒక్కోటీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడవైన ప్లాస్టిక్‌ సంచుల్లో హెరాయిన్‌ నిండుగా నింపారని అధికారులు వివరించారు.

అయితే కడుపులోని క్యాప్సుల్స్‌లో ఒకట్రెండు పగిలిపోవడంతో హమీద్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని, వైద్యులు అతడి ప్రాణాలు నిలిపేందుకు చివరిదాకా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు.

మృతుడి శరీరంపై ఆపరేషన్‌ చేసిన ఆనవాళ్లేవీ కానరాకపోవడంతో.. డ్రగ్స్‌ సంచుల్ని అతడు నోటి ద్వారానే మింగినట్లు భావిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి.

English summary
New Delhi: An 19-year-old Afghan national has been arrested here for trying to smuggle out a quantity of 61 heroin capsules, valued at Rs.8 crores. The drug trafficker, identified as Hameed Mohammed. When he fell down in the airport itself, the customs officials immediately took him hospital. After scanning they found the heroin capsules in his stomach. Doctors of the hospital immediately operated and taken out the capsules from his stomach. But one or more capsules broken inside stomach, and due to that he died on the operation table itself, said oficials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X