• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాలిబన్లతో సత్సంబంధాలను పెట్టుకోవడంలో ఇబ్బందేంటీ: కేంద్రానికి ఫరూక్ అబ్దుల్లా సూటిప్రశ్న

|

శ్రీనగర్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలబన్ల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ వేళ.. వారి పరిపాలనలో ఆ దేశం మళ్లీ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడానికి అగ్రదేశాలు సైతం వెనుకాడుతోన్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికా వైదొలగ్గానే..

అమెరికా వైదొలగ్గానే..


20 సంవత్సరాల కిందట తాలిబన్ల చెర నుంచి బయటపడింది ఆప్ఘనిస్తాన్. తొలుత హమీద్ కర్జాయ్, ఆ తరువాత అష్రఫ్ ఘనీ సారథ్యంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా సైన్యం ఆ దేశానికి కాపలా కాసింది.. ఈ రెండు దశాబ్దాల పాటు. తాలిబన్లను పూర్తిగా అణచివేసింది. ఈ 20 ఏళ్ల కాలంలో తమకు పట్టు ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యారు తాలిబన్లు. ఎప్పుడైతే- అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించిందో.. అప్పటినుంచే విజృంభణ మొదలు పెట్టారు.

 భారత్ భారీ ఇన్వెస్టిమెంట్..

భారత్ భారీ ఇన్వెస్టిమెంట్..

పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా.. దేశం మొత్తాన్నీ అతి కొద్దిరోజుల్లోనే ఆక్రమించుకున్నారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో- భారత్ పెద్ద ఎత్తున నిధులను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది. ఆ దేశ పునర్నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందించింది. ప్రజలకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల కొద్దీ నిధులను అందజేసింది.

మౌలిక సదుపాయాల కోసం..

మౌలిక సదుపాయాల కోసం..

నీటి ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్లతో పాటు మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఆహార సరఫరా వంటి అనేక రంగాలకు నిధులను మంజూరు చేసింది. ఆప్ఘనిస్తాన్ పునర్వైభవవాన్ని పొందడానికి చేయాల్సిందంతా చేసింది భారత్. ఓ మిత్ర దేశంగా అండగా నిలిచింది. తాలిబన్లు- ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో ఆ పెట్టుబడులు, నిధుల మంజూరు, కేటాయింపులన్నీ పూర్తిస్థాయిలో వ్యర్థం అయ్యాయనే వాదనలు ఉన్నాయి.

ఆప్ఘన్ పునర్నిర్మాణానికి బిలియన్ల కొద్దీ డాలర్లు..

ఆప్ఘన్ పునర్నిర్మాణానికి బిలియన్ల కొద్దీ డాలర్లు..

ఇప్పుడు ఇదే అంశం చర్చల్లోకి వచ్చింది. ఆప్ఘనిస్తాన్‌ను ఆదుకున్న భారత్.. తాలిబన్ల హయాంలోనూ ఆ దేశంతో సన్నిహిత సంబంధాలను ఎందుకు కొనసాగించకూడదనే ప్రశ్న తలెత్తింది. దీన్ని లేవనెత్తింది..దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారని, అది ఆ దేశ అంతర్గత విషయమని వ్యాఖ్యానించారు.

సన్నిహిత సంబంధాలు తెంచుకోవడం సరికాదు..

సన్నిహిత సంబంధాలు తెంచుకోవడం సరికాదు..

అక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా, పట్టించుకోనక్కర్లేదని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఆ దేశ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవాలని సూచించారు. తాలిబన్లతో సత్సంబంధాలను కొనసాగించడం ముమ్మాటికీ ప్రమాదకరం కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగించిందో.. అలానే వాటిని సజీవంగా ఉంచుకోవడంలో వచ్చిన ఇబ్బందేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఏంటీ?

ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఏంటీ?

బిలియన్ డాలర్ల కొద్దీ నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి ఎంతో చేసిందని గుర్తు చేశారు. తాలిబన్లను చూసి ద్వైపాక్షిక ఒప్పందాలను తెంచుకోవాలనుకోవడం సరికాదని అన్నారు. తాలిబన్లు మానవతా దృక్పథంతో కూడిన పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఆయన ఇదివరకే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించాలని సూచించారు.

English summary
National Conference leader Farooq Abdullah said that the India spent billions on different projects during the last regime in Afghanistan. We should talk to the current Afghan regime.. he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X