• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా నుంచి పుట్టుకొచ్చిన మరో ఫ్లూ: పందుల నుంచి విస్తరిస్తోన్న కొత్త వైరస్: ఈ రెండు రాష్ట్రాలపై పడగ

|

గువాహటి: ప్రపంచాన్ని చుట్టబెట్టిన ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనాలో మరో సరికొత్త ఫ్లూ వెలుగులోకి వచ్చింది. దీని దుష్ప్రభావం భారత్ కంటే మనదేశంలోనే అధికంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది..వేలాది పందులను బలి తీసుకుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు అధికారులు. అకారణంగా పందులు మరణించడం పట్ల అధికారులు ఆరా తీయగా.. దీనికి కారణం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణమని తేలింది. భారత్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చిన ఈ ఫ్లూ.. మనదేశంలోని రెండు రాష్ట్రాల్లో విస్తరించింది.

  Coronavirus Created By Chaina In Wuhan Labs - Donald Trump | Oneindia Telugu

  మద్యం షాపులకు హారతులు: ముగ్గులు..బ్యారికేడ్లు: 40 రోజుల తరువాత..మందుబాబులకు పండగే

  అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలల్లో..

  అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలల్లో..

  ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ తీవ్రత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలపై తీవ్రంగా పడింది. ఒక్క అస్సాంలోనే 2500కు పైగా పందులు ఈ ఫ్లూ ధాటికి మరణించాయి. 306 గ్రామాల్లో 2500లకు పైగా పందులు మరణించినట్లు అస్సాం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లూను నివారించడానికి లేాదా పందులను సంరక్షించడానికి అవసరమైన వ్యాక్సిన్ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అస్సాంలో 30 లక్షలకు పైగా పందులు ఉన్నట్లు అంచనా. ఈ ఫ్లూ విస్తరించడమంటూ జరిగితే.. వాటి మనుగడ కష్టమౌతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

  చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు..

  చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు..

  చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు ఈ వైరస్ విస్తరించి ఉంటుందనే అనుమానాలను అస్సాం ప్రభుత్వం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్.. చైనా సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. చైనాలోని గ్ఝీజాంగ్ ప్రావిన్స్‌తో సరిహద్దులను పంచుకుంటోంది ఈ రాష్ట్రం. గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ జాడ తొలిసారిగా వెలుగు చూసింది కూడా ఈ ప్రావిన్స్‌లోనే. అక్కడి నుంచి ఈ వైరస్ విస్తరించి ఉంటుందని అస్సాం ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  అరుణాచల్‌లో పోర్క్ బిజినెస్ ఉద్యోగి మృతి

  అరుణాచల్‌లో పోర్క్ బిజినెస్ ఉద్యోగి మృతి

  అరుణాచల్ ప్రదేశ్‌లో పోర్క్ బిజినెస్ చేస్తోన్న ఓ వ్యాపారికి చెందిన 230 పందులు కొన్ని రోజుల వ్యవధిలో మరణించాయని, వాటి పెంపకాన్ని చూసుకునే ఉద్యోగి ఒకరు చనిపోయారని అస్సాం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా వెల్లడించారు. ఫలితంగా ఈ ఫ్లూ వల్ల మనుషులు కూడా అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే తాము అరుణాచల్ ప్రదేశ్‌తో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు.

  కరోనాకు సంబంధం లేదు..

  కరోనాకు సంబంధం లేదు..

  కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెప్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) స్పష్టం చేసినట్లు మంత్రి అతుల్ బోరా తెలిపారు. అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండక తప్పదని అన్నారు. ఫ్లూ బారిన పడిన పందులన్నీ మరణించాయని, వాటిని సంరక్షించడానికి అసవరమైన వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని అన్నారు. ప్రస్తుతానికి 306 గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉందని, దీన్ని విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

  English summary
  The Assam government on Sunday said the first instance of African Swine Flu has been detected in the state and it has already killed around 2,500 pigs across 306 villages. Despite a go-ahead from the Centre, the state government will not resort to culling of the pigs immediately and will adopt an alternate mechanism to prevent the spread of the highly contagious disease, Assam Animal Husbandry and Veterinary Minister Atul Bora said at a press conference.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more