వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాది తరువాత మృత్యువును జయించిన చిన్నారి కనిశ్రీ,: ఒన్ ఇండియాకు థ్యాక్స్ , మీరు!

Google Oneindia TeluguNews

కనిశ్రీ జన్మించిన తరువాత తన ఇద్దరు కుమార్తెలు చిరునవ్వులు చిందించడం, మొదటిసారి తల్లితో కలిసి ఆడుకోవడం చివరికి చూశాను. తన కుమార్తె కనిశ్రీ ఆరోగ్యం కుదటపడటానికి సహకరించిన దాతలకు పేరుపేరునా నేనే ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ మాటలు అంటున్నది ఏడాదిపాటు మృత్యువుతో పోరాటం చేసిన కనిశ్రీ తండ్రి రాజేష్. దాతల దయతో తన కుమార్తె చావును జయించినందుకు చాల ఆనందంగా ఉందని రాజేష్ అంటున్నాడు.

2017 మే నెలలో రాజేష్ దంపతులకు కనిశ్రీ జన్మించింది. అంతకు ముందే రాజేష్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. రాజేష్ దంపతులకు కనిశ్రీ రెండో కుమార్తె. కనిశ్రీ జన్మించిన సమయంలో రాజేష్ దంపతులు సంబరపడిపోయారు. అయితే రాజేష్ దంపతులకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.

కనిశ్రీకి 22 రోజుల వయసు ఉన్న సమయంలో పోలియో చుక్కులు వేయించడానికి తీసుకెళ్లారు. ఆ సందర్బంలో కనిశ్రీ గుండెజబ్బుతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత వైద్య చికిత్స శిభిరానికి కనిశ్రీని తీసుకెళ్లాలని రాజేష్ దంపతులకు వైద్యులు సూచించారు.

రాజేష్ దంపతులు కనిశ్రీని అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరానికి తీసుకెళ్లారు. కనిశ్రీకి వైద్య పరీక్షలు చేసిన అపోలో వైద్యులు చిన్నారికి గుండెజబ్బు ఉందని, కనిశ్రీని బతికించాలంటే శస్త్ర చికిత్స చెయ్యాలని, అందుకు రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.

After 1 year of waiting, little Kanisri finally received her surgery thanks to you!

విషయం తెలుసుకున్న కనిశ్రీ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. నెల రోజులు కూడా నిండని చిన్నారికి ఎంత కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. రాజేష్ కు సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే సంపాదనతో కుమార్తె కనిశ్రీకి శస్త్ర చికిత్స చేయించలేనని రాజేష్ కుమిలిపోయాడు.

బంధువులు, స్నేహితుల దగ్గర రుణం తీసుకుని కుమార్తె కనిశ్రీకి శస్త్ర చికిత్స చేయించాలని ప్రయత్నించాడు. రుణం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజేష్ కు ఆస్తులు ఏమీ లేవు. వస్తున్న ఆదాయంతో కనిశ్రీకి ఔషదాలు కొనుగొలు చేస్తూ కాలం గడిపాడు.

ఇంత చిన్న వయసులో ఎక్కువ ఔషదాలు తీసుకుంటే కనిశ్రీ ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. ఆ సమయంలో క్రౌడ్ ఫండింగ్ అమలులోకి వచ్చింది. రాజేష్ తన కుమార్తె ప్రాణాలు కాపాడటానికి దాతలు సహాయం చెయ్యాలని తన ఆవేదన వెల్లడించాడు.

After 1 year of waiting, little Kanisri finally received her surgery thanks to you!

రాజేష్ కుమార్తె కనిశ్రీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పలువురు దాతలు చలించిపోయారు. ఎలాగైనా చిన్నారి ప్రాణాలు కాపాడటానికి వీలైనంత సహాయం చెయ్యాలని నిర్ణయించారు. కనిశ్రీని కాపాడటానికి 262 మంది దాతలు ముందుకువచ్చారు. 2 వారాల్లో దాతల నుంచి రాజేష్ రూ. 4 లక్షల నిధులు సేకరించడానికి సాధ్యం అయ్యింది.

జూన్ 25వ తేదీన కనిశ్రీని శస్త్ర చికిత్స చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కనిశ్రీ ఆరోగ్య పరిస్థి గమనించడానికి ఐదు రోజుల పాటు వైద్యులు ఐసీయూలో పెట్టారు. అదృష్టవశాత్తు కనిశ్రీకి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోవడంతో ఎట్టకేలకు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.

కనిశ్రీ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. ఏడాది పాటు మృత్యువుతో పోరాడిన తన కుమార్తె ప్రాణాలు కాపాడటానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రాజేష్ అంటున్నారు. దేవుడి దయ, మీరు లేకుంటే ఈ రోజు నా కుమార్తె ప్రాణాలతో ఉండేది కాదని, మీరుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని రాజేష్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇలాగే మరో ఇద్దరు నిరుపేద చిన్నారులు సైతం అనార్యోగంతో బాధపడుతున్నారు. తన కుమార్తె ప్రాణాలు కాపాడటానికి సహాయం చేసిన ఒన్ ఇండియాకు రాజేష్ ధన్యవాదాలు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X