వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:45 రోజులు ఆస్పత్రిలో, 19 సార్లు పరీక్ష, నెగిటివ్ రావడంతో మహిళ డిశ్చార్జ్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వస్తే 14 రోజుల క్వారంటైన్ ఉంచి.. తర్వాత పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తే పంపిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం వైరస్ సోకి 20 రోజులవుతోన్నా.. తొలుత నెగిటివ్ వచ్చి.. తర్వాత పాజిటివ్ వస్తోంది. రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. అయితే కేరళలో ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు 45 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. వైరస్ బారినుంచి బయటపడేందుకు పరీక్షలు చేస్తూనే ఉన్నారు.

కేరళలోని పతనంతిట్టలో ఓ 62 మహిళ కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆస్పత్రిలో ఉండటంతో పదుల సంఖ్యలో వైద్యులు పరీక్షలు చేశారు. 19వ సారి చేసిన పరీక్షలు నెగిటివ్ వచ్చింది. ఇదివరకు కూడా నెగిటివ్ వచ్చిన మళ్లీ మళ్లీ పరీక్షలు చేశారు. దీంతో మహిళ ఊపిరిపీల్చుకుంది. ఆమెను ఇంటికి పంపించేందుకు రాష్ట్ర మెడికల్ బోర్డు అనుమతి ఇవ్వడంతో.. జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ ఎన్ షీజా డిశ్చార్జ్ చేశారు.

After 45 days in hospital and 19 tests, Kerala woman finally free of Covid-19

Recommended Video

Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference

ఆ వృద్దురాలు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి వైరస్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. మార్చి 10వ తేదీన ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. ఆమెకు నెగిటివ్ వచ్చిన కానీ పదే పదే పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. 19వ సారి కూడా నెగిటివ్ రావడంతో పంపించాలని నిర్ణయం తీసుకున్నామని వైద్యులు తెలిపారు.
కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాక వైరస్ సోకింది. అతని 29 రోజుల పరీక్షించాక.. పదే పదే టెస్టుల చేశాక నెగిటివ్ రావడంతో ఇంటికి పంపించారు. అతని మాదిరిగానే వృద్దురాలి విషయంలో కూడా వ్యవహరించారు. వైరస్ సోకిన వారిని 14 రోజులు క్వారంటైన్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరగా.. కేరళలో మాత్రం 28 రోజులు పరిశీలనలో ఉంచుతున్నారు.

English summary
woman who tested positive for Covid-19 for 19 successive times in Pathnamthitta in central Kerala has finally tested negative
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X