వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

92ఏళ్ళ తర్వాత సాధారణ బడ్జెట్ లోనే రైల్వేబడ్జెట్,ఎందుకిలా...

92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది. సంస్కరణల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లను వేర్వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. 92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లోనే కలిపి ప్రవేశపెడుతోంది.ఇక నుండి రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి తెరపడింది.

రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లు వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయం దాదాపుగా 92 ఏళ్ళ క్రితం ప్రారంభమైంది.

బడ్జెట్ 2017-18 పూర్తి వివరాలు బడ్జెట్ 2017-18 పూర్తి వివరాలు

92 ఏళ్ళ క్రితం భారత్ ను బ్రిటిష్ వారు పాలించే సమయంలో సాధారణ బడ్జెట్ , రైల్వే బడ్జెట్ వేర్వేరుగా ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. 1924 లో వేర్వేరుగా బడ్జెట్ లను ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.

పారిశ్రామిక సంపద బడ్జెట్ లో 75 నుండి 85 శాతం కేటాయింపులు ఉంటాయి. జనరల్ బడ్జెట్ లో రైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకొనేవి. అయితే వేర్వేరుగా బడ్జెట్ లు ప్రవేశపెట్టాలని బ్రిటిష్ అధికారులు ప్రతిపాదించారు.

after 92 years railway budet merged in central budget.

పదిమంది సభ్యులున్న అక్వర్త్ కమిటీ 1920 -21 లో ఈ ప్రతిపాదనను తెచ్చారు. అనంతరం 1924 లో దీన్ని సాధారణ బడ్జెట్ నుండి విడదీశారు.

దీని ద్వారా మంచి విధాన రూపకల్పన అమలు చేసే అవకాశం ఉందని భావించారు.ఆనాటి నుండి రెండు బడ్జెట్ లు వేర్వేరుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయం వచ్చింది.

ప్రస్తుతం సాధారణ బడ్జెట్ లో రైల్వేలో కలిగింది కేవలం నాలుగు శాతం మాత్రమే. దీంతో పాటుగా రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సివస్తోంది.
దీంతో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ ను కలపాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు 92 ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఈ రెండుబడ్జెట్ లను కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది.

అయితే సాధారణ బడ్జెట్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే పద్దతి కొనసాగుతోంది.అయితే 1994 నుండి రైల్వే బడ్జెట్ ను కూడ ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా రైల్వేశాఖ మంత్రి జాన్ మతాయి గా రికార్డులకెక్కారు. మొదటి మహిళా రైల్వే శాఖ మంత్రిగా మమత బెనర్జీ చరిత్రలో నిలిచారు.

English summary
after 92 years railway budet merged in central budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X