• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన గులాంనబీ ఆజాద్: వాట్ నెక్స్ట్?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన ప్రకంపనలకు తెర పడట్లేదు. రోజులు గడుస్తున్నప్పటికీ.. దాని తీవ్రత పెరుగుతోందే తప్ప సద్దమణగట్లేదు. అగ్ర నాయకత్వం మొదలుకుని అన్ని స్థాయిల్లోనూ పార్టీని ప్రక్షాళన చేయాల్సి ఉంటుందనే డిమాండ్ అసంతృప్త నేతల్లో పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆత్మరక్షణలో పడేసినట్టయింది. మల్లికార్జున ఖర్గె, అధిర్ రంజన్ చౌధరి వంటి సీనియర్లు ఆయనపై ఎదురుదాడికి దిగేలా చేసింది.

గెలుస్తామనే ధీమా లేనట్టే..

గెలుస్తామనే ధీమా లేనట్టే..

కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు- సీనియర్లల్లో నెలకొన్న అసహనానికి అద్దం పట్టింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం- కాంగ్రెస్ అధిష్ఠానం.. సీనియర్ నేతల మధ్య ఉన్న ఆంతర్యాన్ని మరింత పెంచింది. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించకపోవడం పట్ల వారిని ఆందోళనకు గురి చేస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా కూడా లేకుండా పోయింది.

 జీ 23లో కీలక నిర్ణయాలు..

జీ 23లో కీలక నిర్ణయాలు..

ఒక్క భారీ విజయం కోసం ముఖం వాచి పోయేలా ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఎంతకాలం ఇలా పరాజయాలు వెంటాడుతాయనేది కూడా అర్థం కాని పరిస్థితిలో పడింది. ఈ దారుణ పరాజయాలను సమీక్షించడానికి కాంగ్రెస్‌కు చెందిన జీ-23 నాయకులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాయకత్వ మార్పిడి విషయంపై ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం, సమర్థులైన బయటి నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలపై చర్చించారు.

 భారీ సంస్కరణలు చేపడితే తప్ప..

భారీ సంస్కరణలు చేపడితే తప్ప..

పార్టీని రీవ్యాంప్ చేయాలనే అభిప్రాయాన్ని వారు వినిపించారు. పార్టీలో భారీ స్థాయిలో సంస్కరణలను చేపట్టితే తప్ప- భవిష్యత్తులో విజయాలు దక్కవంటూ తేల్చి చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే తక్షణ సంస్కరణలను అమలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే అభిప్రాయం, డిమాండ్‌తో జీ 23కి చెందిన కొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోనున్నార. నేడో, రేపో ఈ భేటీ ఉంటుందని తెలుస్తోంది.

గులాంనబీ ఆజాద్ సహా

గులాంనబీ ఆజాద్ సహా

తాము నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సోనియా, రాహుల్ గాంధీని కలిసే జీ 23 నాయకుల బృందానికి గులాంనబీ ఆజాద్ సారథ్యాన్ని వహించనున్నారు. ఆయనతో పాటు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, భూపిందర్ సింగ్ హుడా, మణిశంకర్ అయ్యర్, వీరప్ప మొయిలీ, మనీష్ తివారీ సోనియా, రాహుల్‌ను కలుస్తారు. ఈ మేరకు ఆజాద్.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అపాయింట్‌మెంట్ కోరారు.

ఆజాద్ సహా..

ఆజాద్ సహా..

భూపీందర్ సింగ్ హుడా, రాజీందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, వివేక్ టంఖా, ఆనంద్ శర్మ, పీజే కురియన్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్‌రా, శశిథరూర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, కుల్‌దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి, మణిశంకర్ అయ్యర్.. సోనియాగాంధీని కలిసే వారిలో ఉన్నారు.

 అధ్యక్ష పదవికి ఎన్నిక

అధ్యక్ష పదవికి ఎన్నిక

నాయకత్వాన్ని మార్చాలంటూ ఇప్పటికే శశిథరూర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రమే ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. పార్టీ మళ్లీ విజయాలబాట పట్టాలంటే ప్రక్షాళన తప్పదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం రాజీనామాలు చేస్తుందంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. రాజీనామా ప్రతిపాదనలను రెండు రోజుల కిందటే సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తోసిపుచ్చింది. వచ్చే ఆగస్టు 20వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించింది.

English summary
Days after a meeting of Congress Working Committee Senior Congress leader Ghulam Nabi Azad and some other members of the G-23 group will meet interim party president Sonia Gandhi and Rahul Gandhi soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X