వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల కోసమే వ్యాక్సిన్- అన్ని జాగ్రత్తలలతోనే- సీరం, భారత్‌ బయోటెక్‌ ఉమ్మడి ప్రకటన

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లో అత్యవసర పరిస్ధితుల్లో వ్యాక్సిన్‌ వినియోగానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్ బయోటెక్‌ సంస్ధలకు డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి కూడా లభించింది. త్వరలో కేంద్రం అధికారిక ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ రెండు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు తొందరపాటుగా అనుమతులు ఇస్తున్నారంటూ విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి.. వీటిపై స్పందించిన తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్డిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ ఇవాళ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

50 ఏళ్ల లోపు ఉన్నా సరే కరోనా వ్యాక్సిన్‌- షరతులివే- ఏం చేయాలంటే 50 ఏళ్ల లోపు ఉన్నా సరే కరోనా వ్యాక్సిన్‌- షరతులివే- ఏం చేయాలంటే

సీరం, భారత్ బయోటెక్‌ ఉమ్మడి ప్రకటన

సీరం, భారత్ బయోటెక్‌ ఉమ్మడి ప్రకటన

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్ధితుల్లో వాడకానికి అనుమతి పొందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్ సంస్ధలు తమకు అనుమతులు ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇందులో సీరం ఇన్‌స్టిట్యూట్ తరఫున సీఈవో అదార్‌ పునావాలా, భారత్ బయోటె్క్‌ తరఫున సీఎండీ కృష్ణా ఎల్లా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్యానికి మేలు చేసేవని, వాటికి ప్రజల ప్రాణాలను కాపాడే శక్తి ఉందని, ఆర్ధిక వ్యవస్ధలకు పునర్‌ వైభవం తెచ్చేందుకు కూడా ఉపయోగపడతాయని ఇరు సంస్ధలు పేర్కొన్నాయి.

యువ హీరోయిన్ షీలా రాజ్‌కుమార్ హోమ్లీ ఫోటో గ్యాలరీ

ప్రజల ప్రాణాలు కాపాడతామని ఉమ్మడి ప్రతిన

ప్రజల ప్రాణాలు కాపాడతామని ఉమ్మడి ప్రతిన

సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్ బయోటెక్‌ సంస్ధలు తమ ఉమ్మడి ప్రకటనలో ప్రపంచానికి ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఎంత అవసరం ఉంది, దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను సవివరంగా ప్రకటించాయ. మా రెండు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని, మన దేశంతో పాటు ప్రపంచానికి వ్యాక్సిన్ల పంపిణీ సజావుగా జరిగేలా చూడటం తమ కర్తవ్యమని రెండు సంస్ధలూ ప్రకటించాయి తమ సంస్ధలు వ్యాక్సిన్ల అభివృద్ధి కార్యకలాపాలను ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తాయని తెలిపారు. ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల అవసరం ఎంత ఉందో తమకు పూర్తిగా తెలుసునని ఇరు సంస్ధలూ తెలిపాయి. తమ వ్యాక్సిన్లకు ప్రపంచ ప్రాప్తిని అందించే మా ఉమ్మడి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు.

ప్రపంచానికి వ్యాక్సిన్ అందిస్తామని ధీమా

ప్రపంచానికి వ్యాక్సిన్ అందిస్తామని ధీమా


ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదార్‌ పునావాలా తన ట్వీట్‌లో వ్యాక్సిన్లపై ప్రజల్లో గందరగోళం ఉందని, అయితే అన్ని దేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతులకు అనుమతి లభిస్తుందని ఆయన తెలిపారు. భారత్ బయోటెక్ విషయంలో తాజాగా గందరగోళం చెలరేగినా తాము ఉమ్మడి ప్రకటనలో దానిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఇవాళ సంయుక్త ప్రకటనలో ఇరువురూ వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మరోవైపు ప్రోగ్రెసివ్ మెడికోస్ అండ్ సైంటిస్ట్స్ ఫోరం, వైద్యులు మరియు శాస్త్రవేత్తల జాతీయ సంఘం కోవిడ్ వ్యాక్సిన్లకు డిసిజిఐ మంజూరు చేసిన క్లియరెన్స్ చూస్తుంటే సైన్స్‌ కంటే రాజకీయ, ఇతరత్రా లాభాలే ఇందులో ముడిపడి ఉన్నట్లు పేర్కొన్నారు. సమర్థత డేటా లేకుండా అత్యవసర ఆమోదాల కోసం చైనా మరియు రష్యాపై భారత్ త్వరగా విమర్శలు చేస్తోందని, అయితే దాని వంతు వచ్చినప్పుడు శ్రద్ధ వహించడంలో విఫలమైందని ఈ బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
Stating the important task in front of them is saving the lives and livelihoods of populations in India and the world, SII CEO Adar Poonawala and Bharat Biotech chairman Krishna Ella, jointly on behalf of the two firms, on Tuesday issued a statement communicating their combined intent to develop, manufacture and supply the COVID-19 vaccines for India and globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X