• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అది మా ఘనతే! రాహుల్ గాంధీ: థియేటర్ డే శుభాకాంక్షలు అంటూ చురకలు

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన యాంటీ శాటిలైట్ వెపన్ తయారీ ఘనత తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. తమ ప్రభుత్వం రూపొందించిన అంతరిక్ష పరిశోధన విధానాల వల్లే ఇది సాధ్యపడిందని వెల్లడించింది. మిషన్ శక్తి పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం ముగిసిన కొన్ని క్షణాల్లోనే కాంగ్రెస్ పార్టీ వరుసగా ట్వీట్లు సంధించింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖలు ట్వీట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేశారు. బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.

భూ ఉపరితలానికి 300 కి.మీ ఎత్తు: స్పేస్ జామ్ ను క్లియర్ చేసే ఆయుధం!

ఇస్రో, డీఆర్డీఓలకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే..

యాంటీ-శాటిలైట్ వెపన్ ను రూపొందించిన డీఆర్డీఓ, ఇస్రోలను కాంగ్రెస్ పార్టీ అభినందించింది. ఆ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. 1961లో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రూపొందించిన విధానాల వల్లే ఈ ఘనత సాధ్యపడిందని పేర్కొంది. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇస్రోను స్థాపించారని కాంగ్రెస్ వెల్లడించింది. నాటి చర్యల వల్లే ప్రస్తుతం భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో అగ్ర దేశాల సరసన నిలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలంటూ..మోడీకి చురకలు

ఏ-శాట్ ను రూపొందించిన భారత రక్షణ పరిశోధనా సంస్థ.. శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో.. ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రధాని మోడీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాటకాల రాయుడిగా తయారయ్యారని పరోక్షంగా విమర్శించారు రాహుల్ గాంధీ.

నాటి పాలకుల ముందు చూపు చర్యల వల్లే: మమతా బెనర్జీ

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మిషన్ శక్తి వ్యవస్థ.. ఈ నాటిది కాదని, దశాబ్దాల కిందటే అప్పటి పాలకులు తీసుకున్న ముందు చూపు చర్యల వల్ల ఇది సాధ్యపడిందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తల కృషిని ఆమె అభినందించారు. అంతరిక్ష పరిశోధనలు, అభివృద్ధి అనేది రాత్రికి రాత్రి చోటు చేసుకునే పరిణామాలు కావని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తనకు అలవాటైన ధోరణిలో, మిషన్ శక్తి ఘనతను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆ ఘనత శాస్త్రవేత్తలదేనని అన్నారు. మిషన్ శక్తిని ప్రకటించే సమయంలో నరేంద్రమోడీ హద్దు మీది నటించారని ఎద్దేవా చేశారు. నటనకు కూడా ఓ హద్దు ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నుంచి రాజకీయ లబ్దిని పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని అన్నారు. మోడీ ప్రభుత్వ కాల పరిమితి కూడా ముగిసిన ప్రస్తుత తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టును ప్రకటించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ పరిస్థితి మునిగిపోతున్న నావలా మారిందని, ప్రాణవాయువు కోసం ఈ ప్రాజెక్టును ప్రకటించారని ఆమె విమర్శించారు. దీన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు

ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం దారుణం

ఎ-శ్యాట్ ఉపగ్రహాన్ని రూపొందించిన భారత అంతరిక్ష పరిశోధకులు, డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు మాయావతి అభినందనలు తెలిపారు. ఓ మంచి ప్రాజెక్ట్ ను నరేంద్రమోడీ ఎన్నికల లబ్ది కోసం రాజకీయ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో దీని గురించి ప్రకటించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. మోడీ ప్రసంగంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: Minutes after Prime Minister Narendra Modi announced on Wednesday that India has entered the super league of space countries; politicians across parties congratulated the government on India’s landmark success. Former DRDO Chief and NITI Aayog member Dr VK Saraswat said, “This is a fantastic capability to have and it gives us a deterrence in case our adversaries try to militarise the space or try to prevent us from using our existing space capabilities.” We congratulate isro & the Govt on the latest achievement for India. The Indian Space Programme established in 1961 by Pt. Jawaharlal Nehru & the Indian Space Research Organisation set up under Smt. Indira Gandhi has always made India proud with its ground breaking achievements, says Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more