వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్‌లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆపై రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఇకపై జమ్మూ కశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఇక పెట్టుబడులు కూడా తరలివస్తాయని చెప్పారు. అయితే గతేడాది అక్టోబర్‌లో జరగాల్సిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను కేంద్రం వాయిదా వేసింది.

అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జమ్మూ కశ్మీర్

అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జమ్మూ కశ్మీర్

జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్రం అక్కడికి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ముందుగా 7500 ఎకరాల భూమిని సేకరించే పనిలో పడింది. ఇందులో 6250 ఎకరాలు జమ్మూలో సేకరించనుండగా మిగతా భూమిని కశ్మీర్‌లో సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచదేశాల నుంచే కాకుండా భారత దేశంలోని పారిశ్రామికవేత్తలను కూడా ఈ సమావేశంకు భారత ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇక ఈ సమావేశం ఏప్రిల్ మూడో వారంలో ఉండొచ్చని సమాచారం. ఇక సేకరించిన భూమిని లీజుకు కానీ లేదా రెంటుకు కానీ, లేదా పెట్టుబడిదారులు కొనేలా ఆప్షన్స్ ఇస్తున్నారు.

పెట్టుబడుల కోసం భూమిని సేకరిస్తోన్న ప్రభుత్వం

పెట్టుబడుల కోసం భూమిని సేకరిస్తోన్న ప్రభుత్వం


ఆర్టికల్ 370 ఆర్టికల్ 35 ఏ రద్దుతో బయటివారు కూడా ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఆర్టికల్స్ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చాయి. అయితే ఈ ఆర్టికల్స్‌ను రద్దు చేస్తే జమ్మూ కశ్మీర్‌లో పెట్టుబడులు వచ్చి తద్వారా అభివృద్ధి జరుగుతుందనే వాదనను వినిపించింది మోడీ సర్కార్. ఇక ఇన్వెస్టర్ సమావేశంను కూడా జమ్మూ కశ్మీర్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంచి వేదిక కోసం అధికారులు చూస్తున్నారు. ముందుగా కశ్మీర్‌లో ప్రారంభ వేడుకను నిర్వహించి అనంతరం సమావేశాన్ని జమ్మూకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీనగర్‌లోని షేర్-ఈ-కశ్మీరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను చూస్తున్నారు. ఇక్కడ ప్రారంభ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు.

 మూడు ప్రధాన రంగాల్లో పెట్టుబడులు

మూడు ప్రధాన రంగాల్లో పెట్టుబడులు

ఇక జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలు నగరాల్లో రోడ్‌షోలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ రోడ్ షోలు అహ్మదాబాద్, సూరత్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉండే పారిశ్రామిక వేత్తలతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా మూడు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది ప్రభుత్వం. ఒకటి ఆరోగ్య రంగం రెండోది విద్యారంగం మూడోది ఐటీ రంగాల్లో పెట్టుబడులు ఉంటాయని భావిస్తోంది.

English summary
The Jammu & Kashmir administration has decided to identify 60,000 kanals (around 7,500 acres) of government land for potential investors ahead of the much-awaited global investor summit in April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X