వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్స్‌ఫర్డ్‌ టీకా తయారీలో తప్పిదం- విమర్శల జడివాన - నిపుణుల సందేహాలు, విమర్శలు..

|
Google Oneindia TeluguNews

అతి తక్కువ సమయంలో, అత్యంత చౌకగా లభించే ఆక్స్‌ఫర్డ్‌ టీకా రాకతో కరోనాకు ఇక చెక్‌ పెట్టినట్లేనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో దీని తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకా అందరికీ షాకిచ్చింది. టీకా తయారీలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసలు ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగాలతో పాటు తాజాగా విడుదల చేసిన డేటా కూడా సందేహాస్పదంగానే ఉందంటున్నారు.

ఏపీ కరోనా అప్‌డేట్‌- వెయ్యి కేసులు- ఎనిమిది మరణాలు- ఎక్కడెక్కడంటే...ఏపీ కరోనా అప్‌డేట్‌- వెయ్యి కేసులు- ఎనిమిది మరణాలు- ఎక్కడెక్కడంటే...

శాస్త్రవేత్తలతో పాటు పరిశ్రమ నిపుణులు ఆస్ట్రాజెనెకా ప్రారంభంలో డేటాను వెల్లడించిన విధానంలో లోపం, ఇతర అవకతవకలు, విస్మరించిన అంశాలు ఫలితాల విశ్వసనీయతపై వారి విశ్వాసాన్ని దెబ్బతీశాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై జరుగుతున్న ఇతర ప్రయోగాలను కూడా ఇది ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఏదైనా కరోనా వ్యాక్సిన్‌ వాడకానికి అనుమతి ఇవ్వాలంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని వాటి నియంత్రణ సంస్ధలు తిరస్కరించే ప్రమాదం ఎదురవుతుందని వారు చెప్తున్నారు.

After admitting mistake, AstraZeneca faces difficult questions about its vaccine

ఆక్స్‌ఫర్డ్‌ టీకా తయారీలో ఓ కాంట్రాక్టర్‌ తప్పిదం వల్ల లోపాలు చోటు చేసుకున్నాయని ఆస్ట్రాజెనెకా చెప్తుండగా.. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ ఆరంభ దశలోనే లోపాలు బయటపడటం వల్ల అంతిమంగా ఇది మొత్తం వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియపైనే సందేహాలు లేవనెత్తిందని యూఎస్‌కు చెందిన నిపుణులు వ్యాఖ్యానించారు. ఆస్ట్ర్రాజెనెకా తమ టీకాకు సంబంధించిన సమాచారాన్ని వాల్‌స్ట్రీట్‌ విశ్లేషకులకు, కొందరు అధికారులకు మాత్రమే ఎందుకిచ్చిందని, ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోయిందనే ప్రశ్న కూడా వారి నుంచి వినిపిస్తోంది. అన్నింటికీ మించి ఎక్కువ డోసులు ఇచ్చినవారి కంటే తక్కువ డోసులు ఇచ్చిన వారిపైనే ఇది ప్రభావవంతంగా ఎందుకు పనిచేసిందంటూ నిపుణులు వేస్తున్న ప్రశ్నలకు ఆక్స్‌ఫర్డ్‌ వద్ద సమాధానం లేదు. ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ వెలువరించిన టీకా ఫలితాల్లో పారదర్శకత లోపించిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బ్రిటన్‌, బ్రెజిల్‌లో నిర్వహించిన ప్రయోగాల ఫలితాలను కలిపి మొత్తం ఫలితం విడుదల చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
After admitting mistake, Oxford-AstraZeneca's Covid 19 vaccine faces difficult questions about its reliability and trails data also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X