• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ - దుష్యత్ రాజీనామాకు ఒత్తిడి - బీజేపీకి మరో షాక్ తప్పదా?

|

ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ తారా స్థాయికి చేరింది. పంజాబ్ లో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ తమ నేత హర్ సిమ్రత్ కౌర్ చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించింది. ఈ ప్రభావం పంజాబ్ పొరుగు రాష్ట్రం హర్యానాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలో బీజేపీ భాగస్వామిగా ఉన్న జననాయక్ జనశక్తి పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి రైతుపోరాటంలో కలిసిరావాలని ఒత్తిడి పెరుగుతున్నది.

మోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలు

దుష్యంత్ డ్యూయల్ స్టాండ్..

దుష్యంత్ డ్యూయల్ స్టాండ్..

వ్యవసాయ రంగంలో చారిత్రక సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లులను జేజేపీ చీఫ్ దుష్యంత్ మొదట్లో వ్యతిరేకించారు. కానీ, తీరా ఆ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండిపోయారు. దుష్యంత్ డ్యూయల్ స్టాండ్ పై సొంత పార్టీలోనే ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం దుష్యంత్ ను అదే పనిగా టార్గెట్ చేస్తూ వస్తున్నది. పార్టీలకంటే ముందు నుంచే హర్యానా రైతు సంఘాలు దుష్యత్ రాజీనామాకు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ

హర్యానా సర్కార్ కూలుతుందా?

హర్యానా సర్కార్ కూలుతుందా?

బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేజేపీలో కీలక ఎమ్మెల్యే దేవేందర్ బబ్లీ.. సొంత పార్టీ సారధి దుష్యంత్ పైనే బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా దుష్యంత్ పై అసంతృప్తితో ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. బబ్లీ మీడియాతో మాట్లాడిన తర్వాత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలబోతోందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోకున్నా.. కనీసం డిప్యూటీ సీఎం పదవికి దుష్యంత్ రాజీనామా చేయాలనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నది.

చౌతాలా వారసత్వాన్ని మరిచావా?

చౌతాలా వారసత్వాన్ని మరిచావా?

హర్యానా రాజకీయాల్లో చౌతాలా కుటుంబానికి తొలి నుంచీ రైతాంగం అండగా నిలిచిన విషయాన్ని దుష్యంత్ మర్చిపోవద్దని, మాజీ ఉప ప్రధాని, దేవీలాల్‌కు రైతు బాంధవుడిగా గుర్తింపు ఉందని, దుశ్యంత్‌ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కోరారు. రైతుల కోసం కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోలేరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరోనేత దిగ్విజయ్ సింగ్ సైతం ఇదే డిమాండ్ చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా కూడా అకాలీదళ్‌ను అనుసరించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా తీవ్ర పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుందని దిగ్విజయ్ అన్నారు.

  Top News Of The Day : Thousands In China Test Positive For A New Bacterial Infection || Oneindia
  తగ్గని రైతులు.. 25న భారత్ బంద్..

  తగ్గని రైతులు.. 25న భారత్ బంద్..

  వ్యవసాయ బిల్లులు లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానాలో వేల మంది రైతులు రోడ్లను నిర్బంధించి బైఠాయింపులు, ర్యాలీలు చేస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా రైతు సంఘాల ఐక్యవేదిక.. ''ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఈనెల 25న భారత్ బంద్ కు పిలుపునివ్వడం తెలిసిందే. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో పోలీసులు లాఠీ చార్జి చేయడంపై డిప్యూటీ సీఎం దుష్యత్ క్షమాపణలు చెప్పారు. ఒత్తిళ్లు పెరుగుతోన్న నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా బీజేపీ కూటమి నుంచి బయటికి వస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

  English summary
  The resignation of Akali Dal's lone Union Minister Harsimrat Kaur Badal from Prime Minister Narendra Modi's cabinet over a set of farm bills has raised pressure on BJP's Haryana ally Dushyant Singh Chautala, whose Jannayak Janata Party (JJP) is part of the state's coalition government. Dushyant Chautala, the Deputy Chief Minister of Haryana, met with Chief Minister Manohar Lal Khattar early this morning and later went into a huddle with his party's top leadership. The party has 10 MLAs in 90-seat Haryana and helped the BJP take power last year.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X