• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉద్యోగుల జీతం అకౌంట్లు గోల్‌మాల్? ఇరకాటంలో బ్యాంకు.. మాజీ సీఎం భార్య వల్లే..

|

ఉద్యోగుల జీతం అకౌంట్ల మార్పిడి వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ రచ్చకు కారణమైంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంకులో కీలక ఉద్యోగి కావడం, మహారాష్ట్ర ప్రభుత్వ విభాగాల అకౌంట్లు ఒక్కొక్కటిగా యాక్సిస్ బ్యాంకు నుంచి జాతీయ బ్యాంకులకు తరలివెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై అమృత ఫడ్నవీస్ కు, శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేదికి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

శివసేన చీఫ్ ఉద్దేవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కొద్దిరోజుల ముందే ఆయన పార్టీ థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల అకౌంట్లను యాక్సిస్ బ్యాంకు నుంచి జాతీయ బ్యాంకుకు మర్చాలని థానే మేయర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర పోలీసు శాఖ అకౌంట్లను కూడా యాక్సిస్ బ్యాంకు నుంచి వేరే బ్యాంకుకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉద్యోగుల శాలరీ అకౌంట్లు యాక్సిస్ బ్యాంకులో ఉండేలా అమృత ఫడ్నవీస్ చక్రం తిప్పారని, అందుకుగానూ బ్యాంకు యాజమాన్యం నుంచి ఆమె పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందారని ఆరోపణలు వచ్చాయి. వివాదం ముదురుతుండటంతో యాక్సిస్ బ్యాంకు యాజమాన్యం ఇరకాటంలో పడినట్లైంది.

జాగో మహారాష్ట్ర..

జాగో మహారాష్ట్ర..

తనపై వచ్చిన ఆరోపణలకు అమృత ధీటుగా సమాధానం చెప్పారు. ‘‘మహారాష్ట్రలో ఒక చెడ్డ నాయకుడు ఉండటం తప్పుకాదు. కానీ ఆ చెడు వ్యక్తికి మద్దతివ్వడం ముమ్మాటికి తప్పే.. జాగో మహారాష్ట్ర''అంటూ పరోక్షగా సీఎం ఉద్ధవ్ పై ఆమె మండిపడ్డారు. ఫడ్నవిస్ తో తన పెండ్లికి ముందునుంచే థానే మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్లు యాక్సిస్ బ్యాంకులో ఉన్నాయని, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇండియాకు చెందినవేనని, ఈ విషయంలో ప్రభుత్వం కాస్త బుర్రపెట్టి ఆలోచించి, తనను టార్గెట్ చేయడం మానుకోవాలని అమృత సూచించారు.

గోల్‌మాల్ జరగలేదని నిరూపిస్తారా?

గోల్‌మాల్ జరగలేదని నిరూపిస్తారా?

సీఎం ఉద్ధవ్ పై అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోమని అమృత ఫడ్నవీస్ కు శివసేన మహిళా నేత ప్రియాంక చతుర్వేది వార్నింగ్ ఇచ్చారు. అమృత యాక్సిస్ బ్యాంక్‌ ఉద్యోగి అయినందునే ప్రభుత్వ శాఖల అకౌంట్లు ఆ బ్యాంకుకు మళ్లాయని, శాలరీ ఖాతాలు బదలాయించిన తర్వాత బ్యాంకు సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి బీజేపీ పథకాలకు ఎంత నిధులు వచ్చాయనేది విచారిస్తే నిగ్గుతేలుతుందన్నారు. మహారాష్ట్ర ప్రజలకు సలహాలివ్వడం అమృత ఫడ్నవీస్ మానుకుంటే మంచిదని ప్రియాంక హితవుపలికారు.

English summary
The Shiv Sena leader Priyanka Chaturvedi asked if Amruta Fadnavis's vendetta claim meant Devendra Fadnavis favoured moving accounts to Axis Bank as she was employed there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X