వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజమానులను కాపాడేందుకు.. నాగుపాముతో భీకరంగా పోరాడిన శునకం

తన యజమానులను రక్షించేందుకు నాగుపాముతో తలపడటమే కాక, దాంతో వీరోచితంగా పోరాడి పామును చంపి, తనూ ప్రాణాలు వదిలింది ఓ శునకం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఎర్నాకుళం : విశ్వాసం, విధేయతకు మారుపేరైన ఓ జాగిలం ఓ నాగుపాముతో పోరాడిన వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ నాగుపాము బారినుంచి తన యజమానులను రక్షించేందుకు వీరోచితంగా పోరాడి ఆపైన పాము కాటుకు గురై ప్రాణాలు వదిలింది.

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎర్నాకుళంలోని పెరంబవూరులో నివసించే ప్రభుత్వ మాజీ అధికారి గంగాధరన్ దంపతులు నెలరోజుల వయసున్న ఓ కుక్కపిల్లను తమ ఇంటికి తీసుకొచ్చుకుని, దానికి మౌళి అని పేరు పెట్టి పెంచుకోసాగారు.

ఇటీవల ఓ రోజు వారు ఇంట్లో ఉండగా ఐదు అడుగుల పొడవున్న పెద్ద నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన మూడేళ్ల వయసున్న వారి పెంపుడు కుక్క మౌళి ధైర్యంగా ఆ నాగుపామును నిలువరించింది.

After an intense battle, dog sacrifices life to save Kerala family from cobra

దాని అరుపులకు నిద్రలేచిన గంగాధరన్ దంపతులు బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా మౌళి వారిని అడ్డుకుంది. పరుగుపరుగున పోయి ఆ నాగుపాముతో తలపడింది. దాదాపు అరగంట సేపు పామును నిలువరించిన మౌళి చివరికి దాంతో పోరాటానికి దిగింది.

మూడు నిమిషాలపాటు జరిగిన పోరాటంలో చివరికి అది నాగుపామును చంపేసింది. కానీ ఆ పోరాటంలో పాము కాటుకు గురై అది కూడా ప్రాణం వదిలింది. ముచ్చట పడి తన యజమానులు తనను పెంచుకున్నందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టి తన విశ్వాసాన్ని నిరూపించుకుంది మౌళి. ఈ ఘటన అంతర్జాలంలో వైరల్ గా మారింది.

English summary
A pet dog -- Mouli -- proved it too. Mouli, a Dash, spotted a cobra that was trying to enter his house in Perumbavur in Kerala's Ernakulam district and decided to stop it. Nangelil Gangadharan, a retired government official, had adopted Mouli three years ago when he was just a month old. Gangadharan and his wife Vimala are the only residents of the house and that Mouli, now three years old, has been guarding them for a long time now. Waking up to Mouli barking in an unusual way, the couple tried to step out of the house to see what's going on. But a barking Mouli stopped him from stepping out and ran back to take the cobra he had spotted head on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X