వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌ను కలుస్తా, కానీ ఓ షరతు: ఢిల్లీ ప్రధాన కార్యదర్శి

By Pratap
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడానికి తాను సిద్ధమేనని, అయితే కొన్ని షరతులు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ అన్నారు ఈ మేరకు ఆయన కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు.

ఢిల్లీ శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయడానికి కేజ్రీవాల్‌ను కలవాలని అనుకుంంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే, మరోసారి తనపై చేయి చేసుకోరనే హామీ ఇవ్వాలని ఆయన షరతు పెట్టారు.

After assault, Delhi chief secy will meet Kejriwal, but has conditions

ఢిల్లీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తన్నారని, ప్రభుత్వ పాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు బడ్జెట్ సమావేశాలతోనే అది సాధ్యమని, అందువల్ల అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయడానికి తాను, తన అధికారులు వస్తున్నట్లు తెలిపారు.

అయితే, తమపై ఏ విధమైన దాడి కూడా జరగదని ముఖ్మమంత్రి హామీ ఇవ్వాలని అన్నారు. తమతో సమావేశం కూడా సజావుగా, హుందాగా సాగాలని ఆయన అన్నారు. ఈ నెల 19వ తేదీన కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని అన్షు ప్రకాశ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

English summary
A week after the face-off, Chief Secretary Anshu Prakash and his colleagues will meet Delhi Chief Minister Arvind Kejriwal and his minister on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X