• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరపైకి కృష్ణ జన్మభూమి- మధుర కోర్టులో పిటిషన్‌- అయోధ్య విజయం స్పూర్తితో..

|

ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్య రామజన్మభూమి యాజమాన్య హక్కులు పొంది రామమందిర నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే రాష్ట్రంలోని మధురలో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం ప్రారంభమైంది. ఈ మేరకు మధుర కోర్టులో శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ ఇవాళ పిటిషన్‌ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు తొలగించి 13.37 ఎకరాల స్ధలాన్ని కృష్ణ మందిరం కోసం కేటాయించాలని కోరుతూ ఇవాళ శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ లా సూట్‌ దాఖలు చేసింది. దీంతో కృష్ణ జన్మభూమి కోసం పోరు ప్రారంభమైనట్లయింది. అయోధ్య విజయం స్ఫూర్తితో ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు విరాజ్‌మాన్‌ ప్రతినిధులు ప్రకటించారు.

తెరపైకి కృష్ణ జన్మభూమి...

తెరపైకి కృష్ణ జన్మభూమి...

అయోధ్యలో రామజన్మభూమి యాజమాన్య హక్కుల కోసం జరిపిన పోరాటం విజయవంతం కావడంతో ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో కృష్ణ జన్మభూమి కోసం పోరాటం మొదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురను కృష్ణ జన్మభూమిగా పేర్కొంటూ అక్కడ ప్రస్తుతం కృష్ణుడి ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు తొలగించాలంటూ మధుర కోర్టులో శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ ఇవాళ పిటిషన్‌ దాఖలు చేసింది. 13.37 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతాన్ని కృష్ణ జన్మభూమిగా గుర్తించి తమకు అప్పగించాలని పిటిషన్లో విరాజ్‌ మాన్‌ తరఫు న్యాయవాదులు లా సూట్‌లో పేర్కొన్నారు. మధుర బజార్‌ సిటీలో ఉన్న కత్ర కేశవ్‌ దేవ్‌ ప్రాంతంలో కృష్ణుడు జన్మించాడని, ఇక్కడ మసీదు ఈద్గా ట్రస్టు కొందరు ముస్లింల సాయంతో దీన్ని ఆక్రమించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ఈ భూయాజమాన్య హక్కుల వ్యవహారం దేశవ్యాప్తంగా మరో కలకలం సృష్టించబోతోంది.

పిటిషనర్లు వీరే..

పిటిషనర్లు వీరే..

మధుర బజార్‌ సిటీలో ఉన్న కృష్ణాలయం పక్కనే ఉన్న మసీదును తొలగించి ఈ ప్రాంతాన్ని తమకు పూర్తిగా అప్పగించాలని కోరుతూ మధుర కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో రంజనా అగ్నిహోత్రితో పాటు అరుగురు ఉన్నారు. వీరి తరఫున లాయర్లు హరిశంకర్‌ జైన్, విష్ణు జైన్‌ ఈ లా సూట్‌ను దాఖలు చేశారు. యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, షాహీ మసీదు దర్గా కమిటీని వీరు ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు ట్రస్ట్‌ తమకు ఈ భూమిపై ఎలాంటి హక్కులేకపోయినా భారీ నిర్మాణం చేపట్టడం ద్వారా కృష్ణ జన్మభూమిని ఆక్రమించిందని వీరు తన పిటిషన్లో పేర్కొన్నారు.

 గతంలో ఏం జరిగింది ?

గతంలో ఏం జరిగింది ?

1658 జూలై 31 నుంచి 1707 మార్చి 3 వరకూ భారత దేశాన్ని పాలించిన మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పెద్ద సంఖ్యలో హిందూ మత ప్రదేశాలు, దేవాలయాలు కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు విరాజ్‌ మాన్‌ చెబుతోంది. ఇందులో మధురలోని కత్రా కేశవ్‌దేవ్‌ వద్దనున్న శ్రీకృష్ణ జన్మస్ధానం కూడా ఉందని పిటిషన్‌లో విరాజ్‌మాన్‌ పేర్కొంది. అప్పట్లో ఔరంగజేబు సైన్యం పాక్షికంగా కేశవ్‌ దేవ్ ఆలయాన్ని పడగొ్ట్టిందని, బలవంతంగా దీనికి ఈద్గా మసీదుగా పేరు పెట్టారని తెలిపింది. ఆ తర్వాత దీన్ని పూర్తిస్ధాయి మసీదుగా నిర్మించారని చెబుతోంది. దీన్ని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్ బోర్డు, మసీదు ట్రస్టు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయి.

వివాదాస్పద రాజీ...

వివాదాస్పద రాజీ...

1968లో తమకు ఎలాంటి హక్కులు లేకపోయినా మసీదు ట్రస్ట్‌ శ్రీకృష్ణ జన్మస్ధాన్‌ సేవా సంఘ్‌తో అక్రమంగా రాజీ కుదుర్చుకుందని, తద్వారా వీరిద్దరూ న్యాయస్ధానాలను, భక్తులను కూడా మోసం చేశారని తాజా పిటిషన్‌లో శ్రీకృష్ణ విరాజ్‌ మాన్‌ పేర్కొంది. అప్పట్లో కుదుర్చుకున్న రాజీ ద్వారానే ఈ మసీదు ఈద్గాను నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి రాజీ చెల్లదని విరాజ్‌ మాన్‌ వాదిస్తోంది. దేశంలో హిందూ చట్టం ప్రకారం దేవాలయాలకు అప్పగించిన భూమి దేవతల ఆస్తిగా కొనసాగుతుందని, ఇది ఎప్పటికీ నాశనం కావడం కానీ, కోల్పోవడం కానీ జరగదని, దాన్ని ఎప్పుడైనా తిరిగి పొందే హక్కు యజమానులకు ఉంటుందని తెలిపింది.

అయోధ్య స్పూర్తితో తెరపైకి...

అయోధ్య స్పూర్తితో తెరపైకి...

తాజాగా అయోధ్యలో రాజజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పుతో కృష్ణ జన్మభూమి పోరాటం ప్రారంభించేందుకు విరాజ్‌ మాన్‌ సిద్ధమైంది. యాజమాన్య హక్కులకు సంబంధించిన అన్ని ఆధారాలతో మధుర కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో ఔరంగజేబు కాలం నుంచి ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పలు ఘటనలను ప్రస్తావించింది. కత్రా కేశవ్‌ దేవ్ ప్రాంతం కృష్ణ జన్మభూమిగా చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని, ఇందులో మసీదు నిర్మాణం అక్రమని, ఈ ప్రాంతాన్ని తమకు వెంటనే అప్పగించాలని విరాజ్‌ మాన్‌ తమ పిటిషన్లో కోరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ జన్మభూమి వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో కృష్ణ జన్మభూమి యాజమాన్య హక్కులపై న్యాయపోరాటం మొదలుకావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

English summary
after ayodhya ram mandir verdict, now law suit filed in madhura court over krishna janmabhumi in uttar pradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X