వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న అజం ఖాన్ దున్నపోతు, నేడు మిస్సైన టైగర్ కోసం పోలీసుల గాలింపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: మనదేశంలో సాధారణ మనుషులు ఆశ్చర్యపడే సంఘటనలన్నీ ఎక్కువ శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే జరుగుతుంటాయి. గతంలో ఉత్తర ప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ దున్నపోతు మిస్సింగ్ కేసు మాదిరే మరో కేసు నమోదైంది. అయితే ఈసారి దున్నపోతు స్ధానంలో కుక్క ఉంది అంతే తేడా.

తాను ఎంతో ప్రేమంగా పెంచుకుంటున్న కుక్క కనిపించడం లేదంటూ ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మాలవ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, బర్రా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ప్రభునాథ్ సరోజ్ భార్య శకుంతల జర్మన్ షెపర్డ్ కుక్క పిల్ల గత శనివారం నుంచి కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

 After Azam Khan’s buffalo now cop has juniors searching for his missing Tiger

ఈ కుక్కు పిల్లకు వారు పెట్టుకున్న ముద్దు పేరు టైగర్. తమ టైగర్‌ని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 6000 బహుమతిగా ఇస్తామని కూడా ఆమె ప్రకటించారు. ఈ మేరకు మాలవ్వ నగర్‌లో పోస్టర్లు అంటించారు. టైగర్‌కు మూడు సంవత్సరాలు వయసు ఉంటుందని, దానిని ఆమె బల్లియా నుంచి తీసుకువచ్చినట్లు శకుంతల ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్ధానికంగా ఉంటున్న మెడికల్ ఓనర్ చెప్పిన దాని ప్రకారం కొంత మంది పిల్లలు శనివారం రాత్రి సాయంత్రం పూట ఆటలో ఓ జర్మన్ షెపర్డ్ కుక్కు పిల్లను గోవింద నగర్ వైపు తీసుకెళ్లడం చూశానని పోలీసులు తెలియజేయడంతో, టైగర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

English summary
A missing report of an inspector's pet dog at Barra police station in Kanpur has refreshed memories of Azam Khan's missing buffalo case which had the cops on their toes fearing the UP minister's position and authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X