బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు
న్యూఢిల్లీ/పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణను అమలు చేయాలని భావిస్తున్నారు, పార్టీలోని వివిధ విభాగాలలో కొన్ని కొత్త ముఖాలను పరిచయం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు కొందరు వెల్లడించారు.
బీహార్ అభివృద్ధిని కొందరు ఓర్వలేకపోతున్నారు: ప్రతిపక్షాలపై నితీష్ కుమార్ సెటైర్లు

ఖాళీల భర్తీకి సన్నహాలు..
రాష్ట్రాల ఇన్‌ఛార్జిలకు సంబంధించినంతవరకు రెండు ఖాళీలు ఉన్నాయని అజ్ఞాత పరిస్థితిపై కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతం శక్తిసిన్హ్ గోహిల్.. బీహార్, ఢిల్లీలకు ఇంఛార్జీగా ఉన్నారు. ఇక దినేష్ గుండూరావు తమిళనాడు, పుదుచ్చేరి, గోవాల బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, గోవాలకు కొత్త ఇంఛార్జీలను నియమించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో ఈ సెప్టెంబర్‌లో పార్టీ అధిష్టానం పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే లాంటి సీనియర్ నేతలను సీడబ్ల్యూసీ నుంచి తొలగించారు.

ప్రభుత్వంలో ఉండేవారి నుంచి పార్టీ పదవులు ఇతరులకు
అంతేగాక, సోనియా గాంధీకి మద్దతుగా ఉండేందుకు ఆమె ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీని పునర్నిర్మించారు. సీడబ్ల్యూసీ నుంచి ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాదలను తొలగించిన తర్వాత ఈ కొత్త మార్పులు చేయనుండటం గమనార్హం. వీరితోపాటు 23 మంది కాంగ్రెస్ నేతలు ఆగస్టు 7న సోనియా గాంధీకి పార్టీ నాయకత్వంపై, 11 పాయింట్ల ప్రణాళిక గురించి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ చీఫ్ నానా పటోలే ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారని, ఓబీసీ శాఖ ఛైర్మన్ తమ్రద్వజ్ సాహు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హోంమంత్రిగా కొనసాగుతున్నారని తెలిపారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ శాఖ అధినేత నితిన్ రౌత్ ప్రస్తుతం మహారాష్ట్ర ఇంధన మంత్రిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ శాఖ ఛైర్మన్ సూర్జేవాల జనరల్ సెక్రటరీతోపాటు కర్ణాటక బాధ్యతలు చూస్తున్నారని వెల్లడించారు. ఇలా ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని త్వరలోనే భర్తీ చేయబడతాయని తెలిపారు.

బీహార్ ఎన్నికల తర్వాత కీలక మార్పులు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకాలన్నింటినీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాయిదా వేసిందని తెలిపారు. బీహార్ ఎన్నికలు కాగానే ఈ ఖాళీల భర్తీ జరుగుతుందన్నారు. సంస్థాగత, కార్యాచరణ వ్యవహారాల్లో సోనియా గాంధీకి సహాయం చేసే కమిటీలో ఎకె ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోని, కెసి వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, పార్టీ ముఖ్య ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఉన్నారు. లేఖ సంతకం చేసిన వారిలో వాస్నిక్ ఒకరు. ఐదుగురు సభ్యుల సీఈఏకు మధుసూదన్ మిస్త్రీ నాయకత్వం వహిస్తారు, సభ్యులుగా రాజేష్ మిశ్రా, కృష్ణ బైరే గౌడ, ఎస్ జోతిమణి, మరో లేఖ రాసిన వ్యక్తి అరవిందర్ సింగ్ లవ్లీ ఉన్నారు. కొత్తగా చేరిన ప్రధాన కార్యదర్శులు సుర్జేవాలా (కర్ణాటక), జితేంద్ర సింగ్ (అస్సాం), తారిక్ అన్వర్ (కేరళ, లక్షద్వీప్).
ఇక దినేష్ గుండు రావు (తమిళనాడు, పుదుచ్చేరి, గోవా), మణిక్కం ఠాగూర్ (తెలంగాణ), వివేక్ బన్సాల్ (హర్యానా), పవన్ కుమార్ బన్సాల్ (పరిపాలన), రాజీవ్ శుక్లా (హిమాచల్ ప్రదేశ్), హెచ్‌కే పాటిల్ (మహారాష్ట్ర) దేవేంద్ర యాదవ్ (ఉత్తరాఖండ్), మనీష్ ఛత్రత్ (అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ), భక్త చరణ్ దాస్ (మిజోరం, మణిపూర్), కుల్జిత్ సింగ్ నాగ్రా (సిక్కిం, నాగాలాండ్,త్రిపుర) కొత్తగా ఇంఛార్జీ బాధ్యతలు తీసుకున్నారు.

అనేక రాష్ట్ర యూనిట్లలో కొత్త ముఖ్యలు..
ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన వారిలో హరీష్ రావత్ (పంజాబ్), ప్రియాంక గాంధీ వాద్రా (ఉత్తర ప్రదేశ్), ఊమెన్ చాందీ (ఆంధ్రప్రదేశ్), అజయ్ మాకెన్ (రాజస్థాన్), కెసి వేణుగోపాల్ (సంస్థ). ఆర్‌పిఎన్ సింగ్ (జార్ఖండ్), రజనీ పాటిల్ (జమ్మూ కాశ్మీర్), పిఎల్ పునియా (ఛత్తీస్‌గఢ్), శక్తిసింహ్ గోహిల్ (బీహార్, ఢిల్లీ), రాజీవ్ సతవ్ (గుజరాత్, దాద్రా, నగర్ హవేలి, డామన్ డియు) బాధ్యతలలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రాలపై, ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లే వారిపై కూడా దృష్టి సారిస్తుందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అనేక రాష్ట్ర యూనిట్లలో కొత్త ముఖ్యులు ఉంటారన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలసాహెబ్ థోరట్ రాష్ట్రంలోని శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నారు.

రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో..
లోక్‌సభ ఎన్నికలు జరిగిన వెంటనే ఒడిశా కాంగ్రెస్ చీఫ్ నిరంజన్ పట్నాయక్ ఆ పదవి నుంచి వైదొలగాలని భావించినా పార్టీ అంగీకరించలేదు. పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్ సునీల్ కుమార్ జఖర్ రాజీనామా ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ నాయకత్వం తిరస్కరించింది. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని పశ్చిమ బెంగాల్లో పార్టీ చీఫ్‌గా ఎంపిక చేశారు, వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2022లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 56 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శుల మెగా బృందం కూడా ఒక ప్రధాన పునర్నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంది.