వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ తర్వాత యూపీలో.. నది వెంట మృతదేహాలు: గ్రామాల ప్రజల ఆందోళన

|
Google Oneindia TeluguNews

లక్నో: కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడంతో మనదేశంలో రోజుకు సుమారు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండ్రోజుల క్రితం బీహార్ రాష్ట్రంలోని ఓ నదిలో సుమారు 50 మంది మృతదేహాలు కొట్టుకు రాగా, తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్‍‌ వద్ద గంగానిదిలో పలువురు కరోనా రోగుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు వీరి మృతదేహాలను నదిలో పారేసినట్లు తెలుస్తోంది. ఘాజీపూర్ కలెక్టర్ ఎంపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మృతదేహాలు ఎక్కడ్నుంచి వచ్చాయనే విషయాన్ని తేల్చాల్సి ఉందన్నారు.

After Bihars Buxar, bodies found floating in Ganga in UPs Ghazipur

నదిలో కొందరి మృతదేహాలు కొట్టుకొచ్చాయనే విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అధికారులు వెళ్లి పరిశీలించారని సింగ్ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ఇటీవల బీహార్ రాస్ట్రంలోని బక్సర్ వద్ద నదిలో సుమారు 40కిపైగా మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.

నదులు వద్ద మృతదేహాలను పారేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇలా మృతదేహాలను పారేస్తున్నారని తెలిపారు. అనేక మంది చనిపోతుండటంతో వారి మృతదేహాలను కాల్చేందుకు కర్రలు లేకపోవడం, సరైన సదుపాయం లేని కారణంగా కొందరు ఇలా నదుల్లో పారేస్తున్నారని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదిలో భారీ ఎత్తున మృతదేహాలు లభ్యం కావడంపై ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు విచారణకు ఆదేశించాయి. నది ఒడ్డున మృతదేహాలు కుళ్లిపోయిన దశలో ఉండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ మృతదేహాలతో మరింతగా వాతావరణం చెడిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అయితే, నది వెంట ఉన్నవి కరోనా రోగుల మృతదేహాలు కాదని అధికారులు చెబుతున్నారు.

Recommended Video

Tirupathi రుయా హాస్పిటల్ లో విషాదం | లీడర్లు పాలిటిక్స్ పక్కన పెట్టాలి | Ap Corona | Oneindia Telugu

English summary
Day after dozens of bodies, bloated and in various stages of decay, washed up on Monday on the banks of the Ganga in Chausa block of Bihar’s Buxar district, similar sightings were reported on the banks of the river in Ghazipu district of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X