వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడుంది: పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.13వేల కోట్లు బ్యాంకులకు చేరుకోలేదు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దుతో మొత్తం రూ.15.44లక్షల కోట్లు పెద్దనోట్ల రూపంలో వచ్చిందని తిరిగి రూ.15.31లక్షల కోట్లు కొత్త నోట్ల రూపంలో వ్యవస్థలోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు సమాచారం ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో పొందుపర్చింది. రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు వచ్చాయని పేర్కొంది. రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించగానే... రూ.15.28 లక్షల కోట్లు బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు గతేడాది తన వార్షిక నివేదికలో పొందుపర్చింది. ఏదైతే రూ.15.28 లక్షల కోట్లు ఉందో అందులో 99శాతం పెద్దనోట్ల రద్దు నుంచి వచ్చినదే అని రిపోర్టులో పేర్కొంది.

రద్దయిన పెద్ద నోట్ల కచ్చితమైన విలువను తెలుపుతూ పార్లమెంటరీ ప్యానెల్‌కు రిజర్వ్ బ్యాంకు ఓ రిపోర్టును సమర్పించింది. ఆ డబ్బును మొత్తం ధృవీకరించి, కచ్చితమైన విలువను ఇచ్చినట్లు తెలిపింది. నవంబర్ 8, 2016లో ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెబుతూ పెద్ద నోట్ల రద్దు చేశారు. పెద్దనోట్లు ఉండటంతో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయని ఆయన అన్నారు.

After Demonetisation Rs.13000 crore amount of currency dint return to banks

అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శించాయి. పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వాదించాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు తమ డబ్బును తీసుకునేందుకు ఎంతటి అవస్థ పడ్డారో విపక్షాలు గుర్తుచేశాయి. గంటల తరబడి ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారని చెప్పాయి.

ఇదిలా ఉంటే జూన్ 30,2017 నాటికి పెద్ద నోట్లు అన్నీ... బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. వాటన్నిటికీ కచ్చితమైన విలువ వేసినట్లు చెప్పిన రిజర్వ్ బ్యాంక్... నేపాల్, భూటాన్ నుంచి వచ్చిన పెద్ద నోట్లను ఇంకా లెక్కపెట్టాల్సి ఉందని తెలిపింది.

English summary
The Reserve Bank of India said that Rs 15.31 lakh crore of the total Rs 15.44 lakh crore of old currency notes that were demonetised in November 2016 had returned to the system.The information is contained in the RBI’s annual report that was released Wednesday.“The processing of specified bank notes (SBNs) has since been completed at all centres of the Reserve Bank. The total SBNs returned from circulation is Rs 15,310.73 billion,” the central bank said in the annual report referring to demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X