వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎల్‌పీజీ తర్వాత కిరోసిన్‌ సబ్సిడీపై కోత

ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం కన్పిస్తోంది. కిరోసిన్ సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్లాన్ సిద్దం చేస్తోందని తెలుస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం కన్పిస్తోంది. కిరోసిన్ సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్లాన్ సిద్దం చేస్తోందని తెలుస్తోంది.

గ్యాస్ సిలిండర్‌పై కోత మాదిరిగానే కిరోసిన్‌పై సబ్సిడీని కూడ తగ్గించాలని యోచిస్తోంది. ఇంధనాల మార్కెట్ ధరలను సమాజంలోని పేద వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే లక్ష్యంతో చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నట్టు సమాచారం.

After diesel and LPG, government to now end subsidy on kerosene

సబ్సిడీ కిరోసిన్ ధరలను ప్రతి పదిహేను రోజులకు 25 పైసలు పెంచాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా సబ్బిడీని తొలగించేంత వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు దీన్ని అమలు చేయాలని కోరింది.

సబ్సిడీల్లో కోత పెట్టి వినియోగ వస్తువుల ధరలను మార్కెట్ ధరల స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎల్‌పీజీకి మారడానికి వినియోగదారులను ప్రోత్సహిండచంతో పాటు కాలుష్య నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేశాయి.

అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు దీనిపై భారీ సబ్సిడీ అమలుచేస్తున్న డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2016-17లో 66 శాతం క్షీణించిన కిరోసిన్ వినియోగం 78,447 లీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ, చంఢీఘడ్ కిరోసిన్ ఫ్రీ నగరాలుగా ఉన్నాయి.

కాగా, మార్చి 2018 నాటికి వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే వ్యూహంలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 4 చొప్పున పెంచాలని జూలై 31న, ప్రభుత్వం ఆదేశించింది.

English summary
The government has taken further steps to gradually reduce subsidy on kerosene, continuing the series of market-oriented reforms that have galvanised the petroleum sector and attracted big-ticket investment after an era of excessive controls, controversies and untargeted subsidies that made it difficult for private companies to operate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X