చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేపల పులుసు తిని ప్రాణం మీదికి తెచ్చుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :అరుదైన చేపల పులుసు తిని ప్రాణాలమీదికి తెచ్చుకొన్నారు వారంతా. నోటికి రుచిగా ఉంటుందని తిన్న వారంతా చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఒకరు మరణించగా, మరో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.చేపల పులుసు తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతి చేపలను కొనుగోలు చేశాడు. చేపల పులుసు చేయాలని భార్య కు చెప్పాడు.

after eating fish soup one man dead, another five members serious

నారాయణ స్వామి సతీమణి పార్వతి చేపల పులుసు చేసింది. నారాయణస్వామి ఆయన భార్య పార్వతి, మామా పెరుమాళు, అత్త నాగమ్మ చెల్లెలు ఇందిర, చేపల పులుసు కూరతో అన్నం తిన్నారు. అన్నం తిన్న కొద్దిసేపటికే వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి. ఇవి తీవ్రం కావడంతో స్థానికులు వారిని ముండియపాక్కం ఆసుపత్రికి తరలించారు.

ముండియపాక్కం ఆసుపత్రి నుండి పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెరుమాల్ మరణించాడు. మరో ఐదుగురు చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు.చేపల పులుసే అస్వస్థతకు కారణమని వైద్యులు చెబుతున్నార. చేపల వ్యాపారిని అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు.

English summary
one man dead after eating fish soup. and another 5 members serious. this incident happend in tamilanadu state.narayana swamy lived kudumiyana kuppam. he is buy fish from fish stall. his wife parvati cook fish soup. narayana swamy family members ate this fish soup. then they were seriously ill.narayana swamy relative perumal died, 5 members under treatment in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X