వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం..! జనం ఇచ్చిన షాక్‌కు తిండి మానేసిన లాలూ..

|
Google Oneindia TeluguNews

రాంచీ : జబ్ తక్ రహేగా సమోసేమే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్‌మే లాలూ... తన కనుసైగతో బీహార్ పాలిటిక్స్‌ను నడిపిన లాలూ ప్రసాద్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్య ఇది. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటాడని దానర్థం. అయితే దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలు కావడంతో ఆర్జేడీకి పెద్ద కష్టమే వచ్చింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది.

సార్వత్రిక సమరంలో ఆర్జేడీ ఘోర వైఫల్యంపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమితో ఆయన కుంగిపోయారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి లాలూ సరిగా ఆహారం తీసుకోవడంలేదని రాంచీ రిమ్స్‌లో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్లు చెప్పారు. మే 23 నుంచి ఆయన డైలీ రొటీన్ గాడి తప్పిందని అన్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి లాలూ మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోవడంలేదని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ చెప్పారు. మందులు, ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉన్నందున తిండి విషయంలో అజాగ్రత్త వద్దని చెప్పామని అన్నారు.

దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..

After election debacle in Bihar, Lalu Yadav skipping lunch

బీహార్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆర్జేడీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే రాష్ట్రంలో 40స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39స్థానాలు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆర్జేడీ పరిస్థితి మెరుగవుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చని పార్టీ నేతలు లాలూకు సర్ది చెబుతున్నారు. అయినా లాలూ మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
After suffering another rout at the hands of the BJP and Narendra Modi, RJD chief and former Bihar Chief Minister Lalu Prasad Yadav has not been eating his lunch from the last two days. "His daily routine has been in complete disarray. He has not had his lunch for the last two days," said Dr Umesh Prasad of RIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X