వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్వార్డ్ పిలిచిందని ఫేక్ ఫోటో పెట్టిన లాలూ కూతురు, వర్సిటీ స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రతిష్టాత్మక హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా సదస్సులో తాను ప్రసంగం చేశానని ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి తప్పుడు ఫోటోలను విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు.

తనను ప్రసంగించాలని విశ్వవిద్యాలయం ఆహ్వానించిందని చెప్పారు. ఈ మేరకు తాను వెళ్లి మాట్లాడానని పేర్కొన్నారు. అందుకు సంబంధించి కొన్ని చిత్రాలను విడుదల చేసింది.

After 'Fake' Pictures by Lalu Yadav's Daughter Misa Bharti, a Clarification From Harvard

దీనిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్పందించింది. ఆమెను తాము పిలువలేదని చెప్పారు. ఒక ప్రతినిధిగా టిక్కెట్ కొనుక్కొని వచ్చారని సదస్సు నిర్వాహకులు చెప్పారు. కాగా, తన ఫేస్‌బుక్ పేజీలో.. తాను డయాస్ పైన నిలబడి ప్రసంగిస్తున్నట్లు ఉన్న ఫోటోను మీసాభారతి అప్ లోడ్ చేశారు.

యువత పాత్ర పైన హార్వార్డ్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ ఫోటోలను కొన్ని దినపత్రికలు ప్రచురించాయి. దీంతో ఆమె ఎటువంటి ప్రసంగం చేయలేదని, ఆమెను ఆహ్వానించలేదని వర్సిటీ వర్గాలు వివరణ ఇచ్చాయి. దీనిపై మీసా భారతి పైన, లాలూ పైన విమర్శల వర్షం కురుస్తోంది.

English summary
Bihar politician Lalu Yadav's daughter Misa Bharti is facing an embarrassing allegation that she lied about being invited as a speaker by the Harvard University and posted fake pictures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X