వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో లాలూ: అదే సెల్‌లో, వార్తాపత్రికలు, టీవీ, అనుమతుల్లేవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా:దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. 20 ఏళ్ల నాటి ఈ కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూను రాంచీలోని బిర్సాముందాజైలుకు తరలించారు.దోమతెర, టీవీ, వార్తాపత్రికలను లాలూ కోసం జైలు అధికారులు కేటాయించారు.

దాణా కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది, ఈ కేసులో లాలూతో పాటు మరో 15 మందిని సిబిఐ కోరటు దోషులుగా తేల్చింది. అయితే ఈ దోషులకు జనవరి 3వ, తేదిన శిక్షలను ఖరారు చేయనున్నారు.

ఈ కేసులోనే లాలూ ప్రసాద్ ఇంతకుముందు జైల్లోనే గడిపారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసేవరకు లాలూ ప్రసాద్ 77 రోజుల పాటు జైల్లోనే గడిపారు.తాజాగా సిబిఐ కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి లాలూ జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.

లాలూకు దోమ తెర, వార్తాపత్రికలు, టీవీ

లాలూకు దోమ తెర, వార్తాపత్రికలు, టీవీ


దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లాలూను రాంచీలోని బిర్సాముందాజైలుకు తరలించారు. లాలూతో పాటు మరో 15 మందిని ఈ కేసులో సిబిఐ దోషిగా తేల్చింది. జైలుకు లాలూను శనివారం నాడు తరలించారు. జైల్లో లాలూకు వార్తా పత్రికలు, టీవీని ఏర్పాటు చేశారు. దోమల నుండి కాపాడుకొనేందుకు వీలుగా దోమతెరను కూడ లాలూకు జైలు అధికారులు ఇచ్చారు.

2013లో ఇదే సెల్‌లో

2013లో ఇదే సెల్‌లో

దాణా కుంభకోణం కేసులో లాలూ 2013లో అరెస్టైన సమయంలో కూడ రాంచీలోని బిర్సాముందాజైలులో లాలూ ఉన్నాడు. ఆనాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏ సెల్‌లో ఉన్నాడో, ప్రస్తుతం అదే సెల్‌లో లాలూను ఉంచారు.

కలిసేందుకు అనుమతులు లేవు

కలిసేందుకు అనుమతులు లేవు


జైల్లో ఉన్నంతవరకు లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఇతర ఖైదీలు ఆయన సెల్‌లోకి వెళ్లేందుకు అనుమతులు లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో 2013లో అరెస్టైన తర్వాత 2014లో లాలూకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుండి ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

లాలూకు బెయిల్ దక్కేనా

లాలూకు బెయిల్ దక్కేనా

వరుసగా నేరాలకు పాల్పడే వారికి బెయిల్‌ మంజూరు చేసే విషయంలో హైకోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లాలూపై జార్ఖండ్‌లో ఐదు కేసులు, బీహార్‌లో ఒక కేసు నమోదయ్యాయి.లాలూపై కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు తక్షణం బెయిల్‌ లభించే అవకాశం లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
One won't be at fault to think that a political heavyweight like Lalu Prasad Yadav would be given special treatment in jail as it appears customary in many cases in our country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X