వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడికి మరో షాక్: పెరిగిన వంటగ్యాస్ ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి వంటగ్యాస్ ధరల పెరుగుదల రూపంలో మరో షాక్ తగిలింది. సబ్సిడీ వంటగ్యాస్‌పై రూ.2.34, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌పై రూ. 48పెంచుతూ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.

ఈ పెరుగుదలతో న్యూఢిల్లీలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.698.50కి చేరుకుంది. కోల్‌కతాలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.723.50, ముంబైలో రూ.671.50, చెన్నైలో 712.50గా ఉంది.

After fuel price hike, now LPG cylinders to be costlier from today

వంట గ్యాస్ ధరలు పెరగబోవని, రూ.100 వరకు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖ పేర్కొన్న నెల రోజులకే చమురు సంస్థలు ఈ విధంగా ధరలు పెంచడం గమనార్హం. సబ్సిడీ కింద ప్రతి ఏడాది ఇంటికి 12 చొప్పున వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇవి కాకుండా కావాలంటే మాత్రం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే.

English summary
After the hike in petrol and diesel prices, the cost of Liquefied Petroleum Gas (LPG) was also increased on Friday by Rs 2.34 and Rs 48 for subsidised and non-subsidised cylinders respectively. The new price for subsidised (Rs/14.2 Kg) cylinder in Delhi is Rs 493.55, while that of non-subsidised cylinder is Rs 698.50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X