• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kannada flag bikini: మరో అవమానం -బికినీపై కన్నడ జెండా -Amazonపై కర్ణాటక మంత్రి పైర్

|

ఇండియాలో అత్యంత అసహ్యకరమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం రావడం, దానిని కన్నడిగులంతా ముక్తకంఠంతో ఖండించడం, ఇతర భాషల వాళ్లు కూడా కర్ణాటకకు మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్‌కు లీగ‌ల్ నోటీసు జారీ చేస్తామ‌ని కర్ణాటక ప్ర‌భుత్వం హెచ్చ‌రించడంతో.. సెర్చ్ ఇంజన్ సంస్థ వెంట‌నే దిగి వ‌చ్చి.. క్ష‌మాప‌ణ చెప్పింది. అయితే, సెర్చ్ ఫ‌లితాలు తమ అభిప్రాయం కాదు అన్న వివ‌ర‌ణ కూడా గుగుల్ ఇచ్చుకుంది. ఈ వివాదాన్ని మర్చిపోకముందే కన్నడిగలకు మరో అవమానం జరిగింది...

HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్

 ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు

కన్నడ జెండాతో బికినీ

కన్నడ జెండాతో బికినీ

గూగుల్ ఉదంతం మర్చిపోకముందే, కన్నడ సంస్కృతికి అవమానకరమైన చర్యకు ప్రఖ్యాత అమెజాన్ సంస్థ పూనుకుంది. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్.. కెనడా దేశంలో అమ్ముతోన్న బికినీలపై క‌న్న‌డ రాష్ట్ర జెండాతో ముద్రించడం వివాదాస్పదమైంది. పసుపు-ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్‌ వెబ్‌సైట్, యాప్‌లో విక్రయిస్తున్నారు. సదరు ప్రాడక్ట్ ను కన్నడ జెండా బికినీగానే సంస్థ కూడా పేర్కొనడం గమనార్హం. దీనిపై

 ఇంకా ఎంతకాలం అవమానిస్తారు?

ఇంకా ఎంతకాలం అవమానిస్తారు?

అమెజాన్ కెనడా వెబ్ సైట్, యాప్ లో కన్నడ జెండాను ముద్రించిన బికినీలు అమ్మడాన్ని కర్ణాటక సాంస్కృతిక శాఖ‌ మంత్రి అర‌వింద్ లింబాలి తప్పుపట్టారు. ‘‘మొన్న గూగుల్, ఇవాళ అమెజాన్.. ఇంకా ఎంత కాలం మా భాష, సంస్కృతి, జెండాను అవమానిస్తారు?, ఇక చాలు ఆపండి..''అని మంత్రి ఫైరయ్యారు. తప్పుడు రీతిలో లోదుస్తులపై కన్నడ జెండాను ముద్రించి అమ్ముతోన్న అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసినందుకు అమెజాన్ వెంట‌నే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కన్నడ జెండాకు గుర్తింపు ఉందా?

కన్నడ జెండాకు గుర్తింపు ఉందా?

కన్నడిగుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ అంశంలోనైనా రాజీపడబోమని, అమెజాన్ సంస్థ చర్యను తాము స‌హించ‌బోమ‌ని మంత్రి అరవింద్ అన్నారు. కాగా, నిజానికి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా అంటూ ఏదీ లేదు, అయితే, కన్నడ సాంస్కృతిక చిహ్నంగా రూపొందిన జెండాను కన్నడిగులు, ఆ భాష, సాంస్కృతిక ప్రేమికులు విరివిగా వాడుతుంటారు. దానికి గుర్తింపు కల్పించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఏదైమైనా కన్నడ జెండాగా వ్యాప్తిలో ఉన్నదాన్ని బికినీపై ముద్రించి, అదే పేరుతో అమ్మకాలు చేస్తోన్న అమెజాన్ చర్యను కన్నడిగులు తప్పుపడుతున్నారు.

English summary
Minister of Kannada and Culture Aravind Limbavali on Saturday slammed e-commerce giant Amazon for selling a bikini with the Karnataka flag colours and emblem. The minister asked the company to issue a formal apology and threatened legal action. The product, which was put on sale on Amazon's Canadian website under the brand name BKDMS, has now been removed. However, people took screenshots of the yellow and red coloured bikini and circulated it online, asking the e-commerce giant to apologise to Kannadigas. earlier, Google drew the ire of the state and its people by showing Kannada as the 'ugliest language' of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X