వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమ్ము దులుపుతారా: గురువారం పార్లమెంటుకు చిదంబరం.. ఏం మాట్లాడుతారు ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గురువారం పార్లమెంటుకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తన కుమారుడు కార్తీ చిదంబరం చెప్పారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. చిదంబరం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున ఆయన ప్రస్తుతం జరిగే సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు. చిదంబరంకు 106 రోజుల తర్వాత ఎట్టకేలకు బెయిల్‌పై విడుదలయ్యారు.

రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యమా?: 'మహా’ బీజేపీ తీరుపై చిదంబరం ఫైర్రాష్ట్రపతి కార్యాలయంపై దౌర్జన్యమా?: 'మహా’ బీజేపీ తీరుపై చిదంబరం ఫైర్

Recommended Video

News Roundup : Cabinet Clears Citizenship Amendment Bill || Disha Issue || Oneindia Telugu

చిదంబరం బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం ఈడీ వాదనలను తిరస్కరిస్తూ ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 2లక్షల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో పాటు పాస్‌పోర్టును అప్పగించాలని సూచించింది. దేశాన్ని విడిచి వెళ్లరాదని పేర్కొంది. అంతేకాద కేసు విచారణలో ఉన్నందున దీనిపై ఎలాంటి ప్రెస్‌ మీట్‌లు పెట్టరాదని సూచించింది. ఇక కేసుతో సంబంధమున్న సాక్షులను ప్రభావితం చేయడం కానీ రుజువులను ధ్వంసం చేయడం కానీ చేయరాదని స్పష్టం చేసింది.

After granted bail by SC,Chidambaram to attend Parliament session from Thursday

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతికి పాల్పడ్డారని చెబుతూ సీబీఐ చిదంబరంను ఆగష్గు 21న అరెస్టు చేసింది. అయితే అక్టోబర్ 22న సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే ఈడీ అతన్ని మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఇప్పుడు ఈడీ కేసులో కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు కావాల్సిన క్లియరెన్స్‌లన్నీ చిదరంబరం ఇచ్చారని సీబీఐ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే నిబంధనలను ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. మొత్తం రూ.307 కోట్లు మేరా డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో 2017లో చిదంబరంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ 2018లో కేసు నమోదు చేసింది.

English summary
Former finance minister P Chidambaram, who was granted bail by the Supreme Court on Wednesday in the INX Media case, will attend Parliament on Thursday.Chidambaram will be attending the Rajyasabha sessions on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X