వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ తర్వాత బీజేపీకి మరో షాక్: రాజస్థాన్‌లో సత్తా చాటిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

జైపూర్: పటీదార్, ఓబీసీ, దళిత యువ నాయకుల అండ, ఎన్నికల ప్రచార సమయంలో గుళ్లు గోపురాలు తిరిగి గుజరాత్‌లో ఓడినా పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్‌లో మరో ఊరట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

45 సీట్లకు గాను 26 స్థానాల్లో గెలుపొందింది. బన్స్‌వారా, భిల్వారా, జలోర్, కరౌలి జిల్లా పరిషత్‍లలోను కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. నాలుగు జిల్లా పరిషత్‌లకు తోడు 27 పంచాయతీ సమితుల్లో 16 స్థానాల్లో గెలుపొందింది.

After Gujarat high, Congress wins big in Rajasthan local bodies, bags 26 of 45 seats

బీజేపీ కేవలం 10 పంచాయతీ సమితి సీట్లు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ అర్బన్ లోకల్ బాడీలోనే 7 స్థానాలు గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.

అయితే నాలుగు జిల్లా పరిషత్‌లలో ఒక్క సీటును కూడా బీజేపీ గెలుచుకోలేదు. 19 జిల్లాల్లోని 27 పంచాయతీ సమితిలకు, 13 జిల్లాల్లోని 14 నగర పాలికలకు, నాలుగు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగాయి. మొత్తంగా కాంగ్రెస్ 26 స్థానాల్లో గెలిచింది.

English summary
Congress in Rajasthan Tuesday got a reason to rejoice winning all the four zila parishad, 16 of the 27 panchayat samiti seats and six urban local body seats, for which bypolls were held recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X