వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోం ఎన్ఆర్‌సీ జాబితా గందరగోళం,పేరు లేదని ఆందోళన చెందిన మహిళ ఆత్మహత్య...!

|
Google Oneindia TeluguNews

అసోంలో ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసిన ఎన్‌ఆర్‌సీ జాబిత గందరగోళం నెలకోంది. దీంతో లిస్టులో పేరు లేదని అందోళన చెందిన అసోం మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే రాష్ట్రం ప్రకటించిన లిస్టులో మొత్తం మూడు కోట్ల 11 లక్షల మంది పేర్లు ఉండగా ఇంకా 19 లక్షల మంది పేర్లు అందులో లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే పలు పుకార్లు చెలరేగడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నటు తెలుస్తోంది.

గందరగోళంగా అసోం ఎన్ఆర్‌సి జాబితా

గందరగోళంగా అసోం ఎన్ఆర్‌సి జాబితా

గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్న ఎన్ఆర్‌సీ లిస్టు ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఎన్ఆర్‌సీలో లిస్టుపై చాల మంది నేతలు ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో అర్హుల పేర్లు లేకుండా అక్రమంగా చొరబడిన వారి పేర్లు ఉన్నాయని స్వయంగా ఆ రాష్ట్ర మంత్రులే మండిపడ్డారు. మరోవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పేరు సైతం జాబితా లేదని అవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జాబితాలో చోటు కోసం మొత్తం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని రకాల విచారణ జరిగిన తర్వాత నిన్న ప్రకటించిన జాబితాలో పందోమ్మిది లక్షల మంది ప్రజల పేర్లు లేకుండా మూడు కోట్ల 11 లక్షల మంది పేర్లు మాత్రమే ప్రకటించారు.

పేరు లేదని ప్రచారంతో మహిళ ఆత్మహత్య

పేరు లేదని ప్రచారంతో మహిళ ఆత్మహత్య

ముఖ్యంగా జాబితాలోని వ్యక్తుల విషయంలో విషపూరిత ప్రచారం జరుగుతోంది. చాల మంది ముస్లింలు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తన పేరు జాబితాలో లేదని విన్న నార్త్ అస్సాం ప్రాంతానికి చెందిన సోంటీపూర్ జిల్లాలోని జహిరా బేగమ్ అనే మహిళ ఆందోళన చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమే మరణం తర్వాత విడుదలైన జాబితాలో ఆమేతో పాటు కుటుంభ సభ్యుల పేర్లు కూడ ఉండడం గమనార్హం.

పలు పార్టీల విమర్శలు ఎదుర్కోంటున్న ఎన్ఆర్‌సీ

పలు పార్టీల విమర్శలు ఎదుర్కోంటున్న ఎన్ఆర్‌సీ


ఇక శనివారం విడుదలైన జాబితా పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాబితా అభాసుపాలు అయిందని అన్నారు. ఈనేపథ్యంలోనే నిజమైన భారతీయును జాబితాలో చోటు కల్పించి న్యాయం చేయాలని ఆమే డిమాండ్ చేశారు.మరోవైపు రాజకీయ విశ్లేషకుడు,జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ సైతం జాబితా గందరగోళంగా ఉందని విమర్శించారు.జాబితా ప్రణాళిక బద్దంగా నిర్వహించకుండా మరింత సమస్యను మరింత జఠిలం చేశారని ఆయన అన్నారు.

English summary
nearly 19 lakh people from Assam were excluded Saturday from a final citizenship list that is intended to identify legal residents and weed out illegal immigrants, amid fears they could be rendered stateless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X